బాలూ గారికి కరోనా సోకడానికి నేను కారణం కాదు..

  • Published By: sekhar ,Published On : August 21, 2020 / 01:00 PM IST
బాలూ గారికి కరోనా సోకడానికి నేను కారణం కాదు..

Updated On : August 23, 2020 / 7:58 PM IST

Singer Malavika Gives Clarity On SPB: సుప్రసిద్ధ గాయకులు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఎస్పీబీకి కరోనా సోకడానికి సింగర్ మాళవిక కారణమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.



జూలై నెలాఖరులో హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి బాలు హాజరయ్యారని, తనకు కరోనా పాజిటివ్ అని తేలినా ఆ కార్యక్రమంలో మాళవిక పాల్గొందని, ఆమె కారణంగానే బాలు కోవిడ్-19 బారిన పడ్డారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై మాళవిక ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న వారిపై సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన గురించి తప్పుడు ప్రచారం చేయవద్దని మాళవిక విజ్ఞప్తి చేసింది.