Singer Minmini : ఇళయరాజా వల్లే నా కెరీర్ నాశనమైంది.. సింగర్ సంచలన వ్యాఖ్యలు..
తాజాగా ఓ సింగర్ ఇళయరాజాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇళయరాజా దగ్గర ఉండే సింగర్స్ టీంలో మిన్మిని ఒక ప్లే బ్యాక్ సింగర్ గా ఉండేది.

Singer Minmini sensational comments on Ilayaraja goes viral
Ilayaraja : భారతదేశ సంగీత ప్రపంచంలో ఇళయరాజా ఎంతటి పేరు సంపాదించారో అందరికి తెలిసిందే. ఇళయరాజా మ్యూజిక్, పాటలు అంటే ప్రేక్షకులు ఎంతో ఆనందంగా వింటారు. అనేక భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ని ఇళయరాజా అందించారు. సంగీతంలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా వ్యక్తిగతంగా మాత్రం అప్పుడప్పుడు వివాదాల్లో నిలిచారు ఇళయరాజా. గతంలో బాలసుబ్రహ్మణ్యం పాడే సాంగ్స్ పేటెంట్స్ విషయంలో కూడా ఇళయరాజా వార్తల్లో నిలిచారు.
తాజాగా ఓ సింగర్ ఇళయరాజాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇళయరాజా దగ్గర ఉండే సింగర్స్ టీంలో మిన్మిని ఒక ప్లే బ్యాక్ సింగర్ గా ఉండేది. అయితే ఏ ఆర్ రెహమాన్ 1992లో తన మొదటి సినిమా రోజాలో మిన్మినితో చిన్ని చిన్ని ఆశ సాంగ్ పాడించారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ పాట మిన్మినినే పాడింది. ఈ పాట దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అవ్వడంతో ఒక్కసారిగా మిన్మిని పేరు ఫేమస్ అయింది.
అయితే ఈ విషయం ఇళయరాజాకు తెలిసి ఆమెని స్టూడియోకి పిలిపించి.. నా టీంలో పనిచేస్తూ వేరే వాళ్ళ దగ్గర ఎందుకు పాడుతున్నావు? నువ్వు బయట పాడటానికి వీల్లేదు, నా దగ్గరే పాడాలని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారట ఇళయరాజా. దీంతో స్టూడియోలోనే మిన్మిని ఏడ్చేసింది. అక్కడున్న వారంతా తన ఏడుపుని చూస్తూ అలా ఉండిపోయారని, ఆ తర్వాత సింగర్ మనో ఆమెని ఓదార్చి, సపోర్ట్ ఇచ్చినట్టు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది మిన్మిని.
Upasana : ఉపాసనకు, పాపకు ఎంత గ్రాండ్‌గా ఇంట్లోకి వెల్కమ్ చెప్పారో చూడండి..
ఆ సంఘటన తర్వాత ఇళయరాజా నన్ను పాటలు పాడటానికి పిలవలేదని, ఈ విషయం తెలిసి బయట కూడా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ అవకాశాలు ఇవ్వలేదని చెప్పింది. పలు సూపర్ హిట్ సాంగ్స్ పాడినా ఇళయరాజా అలా చేయడం వల్లే బయటి వాళ్ళు కూడా ఆయనకు భయపడి, నాకు అవకాశాలు ఇవ్వకపోవడం వల్లే నా కెరీర్ అంతమైంది అని తెలిపింది. కేవలం ఐదేళ్లు సాగిన ఆమె కెరీర్ ఆ తర్వాత సినీ పరిశ్రమకు దూరమైంది. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు కొన్ని పాటలు పాడినా ఆరోగ్యం సహకరించకపోవడంతో పూర్తిగా సినిమాల నుంచి తప్పుకున్నట్టు తెలిపింది మిన్మిని. దీంతో మిన్మిని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.