హీరోయిన్‌తో విడాకులు తీసుకున్న సింగర్ నోయల్..

  • Published By: sekhar ,Published On : September 1, 2020 / 12:54 PM IST
హీరోయిన్‌తో విడాకులు తీసుకున్న సింగర్ నోయల్..

Updated On : September 1, 2020 / 1:55 PM IST

Singer Noel divorced: తాజాగా టాలీవుడ్‌లో మరో జంట విడిపోయింది అనే వార్త మీడియా మరియు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉండి, గతేడాది పెళ్లి చేసుకున్న ర్యాప్ సింగర్ నోయల్‌, హీరోయిన్ ఎస్తేర్ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇద్దరు తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా ప్రకటించారు.



Singer Noel‘‘చాలా రోజుల నిశ్శబ్దం తర్వాత అధికారికంగా ఎస్తేర్‌తో నాకు విడాకులు అయిన విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తున్నా. ఈ విషయాన్ని పబ్లిక్‌గా చెప్పేందుకు కోర్టు తీర్పు కోసం వేచి ఉన్నాం. ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలతో విడాకులు తీసుకున్నాము. ఎస్తేర్ నీ కలలు నిజం కావాలని కోరుకుంటున్నా. ఎస్తేర్‌ను గానీ, నా కుటుంబాన్నిగానీ ఈ విషయంలో దయచేసి ఇబ్బంది పెట్టకండి అని అభ్యర్థిస్తున్నా. బాధలో ఉన్నప్పుడు నా పక్కన అండగా నిలబడిన నా కుటుంబం, స్నేహితులు అందరికీ థ్యాంక్స్‌. దేవుడు ఎప్పుడూ మంచి చేస్తాడు. కొత్త జీవితానికి ప్రారంభించడానికి ఇది మంచి సమయమని భావిస్తున్నా’’ అని నోయల్‌ పోస్ట్ చేశారు. ఎస్తేర్ తెలుగులో తేజ దర్శకత్వం వహించిన ‘1000 అబద్ధాలు’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది. సునీల్ సరసన ‘భీమవరం బుల్లోడు’లోనూ కథానాయికగా నటించింది.
https://10tv.in/senior-actor-krishnamraju-makes-fish-curry-for-family/