ఐసీయూలో సోనూ నిగమ్
మూడు రోజులపాటు ఐసీయూలో సోనూ నిగమ్.

మూడు రోజులపాటు ఐసీయూలో సోనూ నిగమ్.
డాక్టర్‌కి కూడా తన దాకా వస్తేనే కానీ, తలనొప్పి బాధ అర్థం కాదు అనే సామెత ఊరికే చెప్పలేదు పెద్దోళ్ళు. సామాన్యుడికైనా, సెలబ్రెటీకైనా ఆకలి, నిద్ర, నొప్పి ఒక్కటే.. రీసెంట్‌గా ఫేమస్ సింగర్ సోనూ నిగమ్ హాస్పిటలైజ్డ్ అయ్యాడు. ఎందుకు, ఏంటి అనేది సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఫుడ్ అలెర్జీకి గురవ్వడంతో మూడు రోజులపాటు ఐసీయూలో ఉన్నాడట. కళ్ళు, ముఖం వాచిపోయిన పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.
ఒడిశాలో ప్రోగ్రామ్ ముగించుకుని వచ్చేటప్పుడు సీ ఫుడ్ తిన్నాను. అది పడక ఒంటికి అలెర్జీ వచ్చేసింది. నా కళ్ళు, ముఖం అంతా వాచిపోయాయి. ఆ టైమ్‌లో దగ్గర్లో కనుక హాస్పిటల్ లేకపోతే, ఊపిరాడక నా సిచ్చుయేషన్ క్రిటికల్‌గా తయారయ్యేది. ఇది నాకో గుణపాఠం లాంటిది. నా సలహా ఏంటంటే, అలెర్జీ విషయంలో ఎవ్వరూ ఎలాంటి ఛాన్స్‌లు తీసుకోవద్దు. అందరూ హెల్థీగా, హ్యాపీగా ఉండండి.. అందరికీ థ్యాంక్స్.. అంటూ తన బాధని చెప్తూ, ఫోటోలను షేర్ చేసాడు సోను నిగమ్.