Sirivennela Family : సిరివెన్నెల కుమారులిద్దరూ సినీ పరిశ్రమలోనే..
సిరివెన్నెల స్పూర్తితో ఆయన ఇద్దరు కొడుకులు కూడా సినీరంగ ప్రవేశం చేశారు..

Sirivennela Family
Sirivennela Family: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. సిరివెన్నెలకు భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు రాజా, యోగేష్ ఉన్నారు.
Sirivennela Sitaramasastri : సాహిత్యానికి ఇది చీకటి రోజు – చిరు
తండ్రి స్పూర్తితో ఇద్దరూ కూడా సినీరంగ ప్రవేశం చేశారు. అది కూడా ఒకరు సంగీతం, మరొకరు నటన వైపు కావడం విశేషం. పెద్దబ్బాయి యెగేశ్వర్ శర్మ ‘కుదిరితు కప్ కాఫీ’ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. తర్వాత ‘రంగు’ వంటి పలు సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు.
Sirivennela : సీతారామశాస్త్రి అక్కడ స్పేస్ క్రియేట్ చేసుకున్నారు.. త్రివిక్రమ్ హిస్టారికల్ స్పీచ్..!
ఇక చిన్నబ్బాయి రాజా చేంబోలు నటుడిగా నిరూపించుకున్నారు. ‘కేక’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన రాజా.. రామ్ చరణ్ ‘ఎవడు’ మూవీలో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేసి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు రాజా.
Sirivennela : సిరివెన్నెల రాసిన చివరి రెండు పాటలు ఇవే..