Sitara Ghattamaneni : ‘దమ్ మసాలా’ అంటూ దుమ్ము రేపుతున్న సితార పాప డ్యాన్స్ వీడియో
సినిమాల్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వకుండానే సితార డ్యాన్స్‌తో దుమ్ము రేపుతోంది. గుంటూరు కారం సినిమాలోని 'దమ్ మసాలా' పాటకి సితార వేసిన స్టెప్పులు చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

Sitara Ghattamaneni
Sitara Ghattamaneni : ఇంకా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వకుండానే భారీ పాపులారిటీ సంపాదించుకుంటోంది సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార. సోషల్ మీడియాలో తన డ్యాన్స్ వీడియోలతో దుమ్ము రేపుతోంది. తండ్రికి తగ్గ తనయ అంటున్నారు మహేష్ అభిమానులు. తాజాగా సితార గుంటూరు కారం సినిమాలోని ‘దమ్ మసాలా’ పాటకు వేసిన స్టెప్పులు చూసి అదరహో అంటున్నారు.
Sitara : ‘గుంటూరు కారం’లోని మహేష్ బాబు షర్టుతో.. ఏఎంబి మాల్‌లో సందడి చేసిన సితార..
మహేష్ డాటర్ సితార సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటారు. తన డ్యాన్స్ వీడియోలో పెడుతూ పాపులారిటీ తెచ్చుకున్నారు. చాలా చిన్న వయసులోనే యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న సితార ప్రముఖ జ్యుయలరీ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు. దాని ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ సేవా కార్యక్రమాలకు వినియోగించినట్లు గతంలో చెప్పారు. సితారకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. తను పెట్టే డ్యాన్స్ వీడియోలు చూసి అభిమానులు సంబరపడుతుంటారు. గుంటూరు కారం సినిమా రిలీజైనప్పటి నుండి ఫుల్ జోష్‌లో ఉన్నారు సితార. కొద్దిరోజుల క్రితం ‘ట్రిప్పింగ్.. ట్రిప్పింగ్’ అంటూ ఆ సినిమాలోని పాటకు స్టెప్పులు వేసారు. తాజాగా ‘దమ్ మసాలా’ అంటూ స్టెప్పులు ఇరగదీశారు. సోషల్ మీడియాలో ఈ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.
Sitara Ghattamaneni : గుంటూరు కారం పాటకి సితార పాప డ్యాన్స్ చూసారా?
గుంటూరు కారం విజయం తర్వాత మహేష్ తన ఇంట్లో ఇచ్చిన పార్టీలో సితార సందడి చేసారు. రీసెంట్‌గా గుంటూరు కారం సినిమాలో మహేష్ ధరించిన రెడ్ షర్ట్ వేసుకుని ఏఎంబి మాల్‌కి వచ్చారు. తన స్నేహితులైన వంశీ పైడిపల్లి, మెహర్ రమేష్ కూతుళ్లతో మరోసారి గుంటూరు కారం సినిమా వాచ్ చేసారు. ఇలా సితార భలే సందడి చేస్తున్నారు. భవిష్యత్‌లో అవకాశం వస్తే సినిమాల్లో నటిస్తానని గతంలో సితార చెప్పారు. ఇప్పుడే ఇంత యాక్టివ్ ఉన్న సితార స్క్రీన్ పై తన నటనతో ఇంకెంత జోష్ పంచుతారో అని మహేష్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారట.
View this post on Instagram