Sitara : ‘గుంటూరు కారం’లోని మహేష్ బాబు షర్టుతో.. ఏఎంబి మాల్‌లో సందడి చేసిన సితార..

'గుంటూరు కారం' సినిమాలో మహేష్ బాబు ధరించిన రెడ్ షర్టుని వేసుకొని సితార ఏఎంబి మాల్‌కి వచ్చింది.

Sitara : ‘గుంటూరు కారం’లోని మహేష్ బాబు షర్టుతో.. ఏఎంబి మాల్‌లో సందడి చేసిన సితార..

Sitara Ghattamaneni shines in Guntur Kaaram Mahesh Babu Out Fits

Updated On : February 1, 2024 / 8:43 PM IST

Sitara : మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని.. సినిమాల్లోకి రాకముందే మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంటుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ సందడి చేస్తుంటుంది. తండ్రి మహేష్ పాటలకి, లేదా బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్స్ కి డాన్స్ వేస్తూ నెట్టింట వైరల్ అవుతుంటుంది. ప్రస్తుతం సితార ఒక చిన్న గ్యాంగ్ ని కూడా మెయిన్‌టైన్ చేస్తుంది.

టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి, మెహర్ రమేష్ కూతుళ్లు, సితార మంచి ఫ్రెండ్స్. డాన్స్ వీడియోలతో పాటు అప్పుడప్పుడు వాళ్ళతో కలిసి థియేటర్స్, షాపింగ్స్ అంటూ సందడి చేస్తుంటుంది. తాజాగా ఆ ఇద్దరు స్నేహితురాళ్ళతో కలిసి సితార.. ఏఎంబి మాల్‌లో కనిపించింది. ఫ్రెండ్స్ తో కలిసి మరోసారి ‘గుంటూరు కారం’ సినిమా చూసి ఎంజాయ్ చేసింది. ఇక ఈ సినిమా చూడడానికి సితార.. గుంటూరు కారం అవుట్ ఫిట్స్ తో కనిపించింది.

Also read : Upasana : గవర్నర్ తమిళిసైకి ఉపాసన కృతజ్ఞతలు.. ‘మా మావయ్య కూల్’ అంటూ పోస్ట్..

సినిమాలో మహేష్ బాబు ధరించిన రెడ్ షర్టుని వేసుకొని సితార ఏఎంబి మాల్‌కి వచ్చింది. తండ్రి అవుట్ ఫిట్స్ తో సితార కనిపించడంతో.. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పోస్టులు చూసిన మహేష్ అభిమానులు.. ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇక గుంటూరు కారం మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే.. రిలీజయ్యి మూడు వారలు పూర్తి అయ్యేపాటికి ఈ చిత్రం 240 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకున్నట్లు సమాచారం. ఇక థియేటర్ లో మంచి కలెక్షన్స్ నే రాబట్టిన ఈ చిత్రం.. ఓటీటీకి ఎప్పుడు వస్తుందో అని అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమ్ కాబోతుంది. ఈనెలలో రెండు మూడు వారాల్లో రిలీజయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. అయితే మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.