Sobhita Dhulipala : పెళ్లిపై శోభిత ధూళిపాళ స్పెషల్ సినిమా.. ‘లవ్ సితార’ ట్రైలర్ రిలీజ్..
త్వరలో నాగచైతన్యని పెళ్లి చేసుకోబోతున్న శోభిత ధూళిపాళ ఇప్పుడు పెళ్లి కాన్సెప్ట్ సినిమాతో రాబోతుంది.

Sobhita Dhulipala New Film Love Sitara Trailer Released
Sobhita Dhulipala : తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు, సిరీస్ లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల నాగచైతన్యని నిశ్చితార్థం చేసుకొని బాగా వైరల్ అయింది. త్వరలో నాగచైతన్యని పెళ్లి చేసుకోబోతున్న శోభిత ధూళిపాళ ఇప్పుడు పెళ్లి కాన్సెప్ట్ సినిమాతో రాబోతుంది. శోభితా ధూళిపాళ, రాజీవ్ సిద్ధార్థ్ జంటగా రోనీ స్క్రూవాలా RSVP మూవీస్ నిర్మాణంలో వందనా కటారియా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘లవ్ సితార’. ఈ సినిమాలో సోనాలి కులకర్ణి, జయశ్రీ, వర్జీనియా రోడ్రిగ్జ్, సంజయ్ భూటియాని, తమరా డిసౌజా, రిజుల్ రాయ్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.
Also Read : Vijay Last Movie : తమిళ్ స్టార్ హీరో విజయ్ లాస్ట్ మూవీ అనౌన్స్.. ఎమోషనల్ వీడియో రిలీజ్..
లవ్ సితార సినిమా డైరెక్ట్ జీ5 ఓటీటీలో రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 27 నుంచి లవ్ సితార జీ5 లో స్ట్రీమ్ అవ్వబోతుంది. తాజాగా ఈ లవ్ సితార హిందీ ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా శోభిత ధూళిపాళ నెక్స్ట్ సినిమా లవ్ సితార ట్రైలర్ చూసేయండి..
ట్రైలర్ చూస్తుంటే.. తార (శోభితా ధూళిపాళ) మంచి పేరున్న చెఫ్ అర్జున్ (రాజీవ్ సిద్ధార్థ)తో ప్రేమలో పడుతుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకుందామనుకుంటారు. పెళ్లికి ముందు తార ఇంటికి అర్జున్ ఫ్యామిలీ వెళతారు. అక్కడ పెళ్లి జరగటానికి ముందు కుటుంబాల్లో విబేదాలు రావడం, తార – అర్జున్ మధ్య కూడా విబేధాలు రావడంతో వీరి ప్రేమ ఏమైంది? పెళ్లి జరిగిందా అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఇక సినిమాని చాలా భాగం కేరళలో షూట్ చేసినట్టు తెలుస్తుంది.
ఈ లవ్ సితార సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో నిర్వహించగా ఈ ఈవెంట్లో శోభితా ధూళిపాళ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను పోషించిన పాత్రకు చాలా షేడ్స్ ఉన్నాయి. ఇందులో ఒక ఇంటీరియర్ డిజైనర్ పాత్ర పోషించాను. నిజాయతీగా ఉండే ఓ అమ్మాయి జీవితంలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొంది అనే కథతో ఈ సినిమా రాబోతుంది అని తెలిపింది.