Vijay Last Movie : తమిళ్ స్టార్ హీరో విజయ్ లాస్ట్ మూవీ అనౌన్స్.. ఎమోషనల్ వీడియో రిలీజ్..
తాజాగా విజయ్ లాస్ట్ సినిమాని ప్రకటించారు.

Tamil Star Hero Vijay Last Movie Thalapathy 69 Announced Emotonal Video goes Viral
Vijay Last Movie : తమిళ్ స్టార్ హీరో విజయ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇకపై సినిమాలు ఆపేస్తానని కూడా ప్రకటించాడు. దీంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. అయితే ఇటీవల వచ్చిన విజయ్ Goat సినిమానే అతని లాస్ట్ సినిమా అనుకున్నారు. కానీ అది లాస్ట్ సినిమా కాదంటూ తాజాగా క్లారిటీ ఇస్తూ విజయ్ లాస్ట్ సినిమాని ప్రకటించారు.
విజయ్ లాస్ట్ సినిమా తమిళ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన KVN ప్రొడక్షన్స్ లో తెరకెక్కనుంది. తాజాగా ఈ నిర్మాణ సంస్థ నుంచి విజయ్ లాస్ట్ సినిమా అనౌన్స్మెంట్ అంటూ ఓ ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసారు. ఈ వీడియోలో.. విజయ్ సినిమాలు ఫ్యాన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, విజయ్ వల్ల ఎంతమంది సహాయం పొందారు, విజయ్ ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు.. అంటూ ఫ్యాన్స్ మాటల్లో, కొన్ని విజువల్స్ తో ఎమోషనల్ గా చూపించారు. విజయ్ 69వ సినిమానే అతని లాస్ట్ సినిమా అంటూ ప్రకటించి ఆ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ రేపు సెప్టెంబర్ 14 సాయంత్రం 5 గంటలకు ప్రకటిస్తామని తెలిపారు.
Also Read : Devara : దేవర సెన్సార్ పూర్తి.. ఏ సర్టిఫికెట్ ఇచ్చారో తెలుసా?
దీంతో ఈ మోషనల్ వీడియో వైరల్ గా మారింది. విజయ్ ఫ్యాన్స్ కంటతడి పెడుతున్నారు. విజయ్ లాస్ట్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు, విజయ్ సినిమా ఎవరి దర్శకత్వంలో ఉండనుంది? ఎలాంటి కథతో రాబోతుందో అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. తమిళనాడు అంతా విజయ్ చివరి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ అయితే సినిమాలు ఆపేసినా పొలిటికల్ గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. మరి విజయ్ లాస్ట్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఆ ఎమోషనల్ వీడియో మీరు కూడా చూసేయండి..