Sonali Kulkarni : దేశంలో చాలా మంది అమ్మాయిలు సోమరితనంతో ఉన్నారు.. బాలీవుడ్ నటి కులకర్ణి!
కన్నడ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన సోనాలి కులకర్ణి.. తమిళ, హిందీ, మరాఠి, గుజరాతీ, ఇంగ్లీష్, ఇటాలియన్, కొరియన్ భాషల్లో నటించింది. 70 కు పైగా సినిమాల్లో నటించిన కులకర్ణి నేషనల్ అవార్డుని కూడా అందుకుంది. తాజాగా దేశంలోని ఆడవారి పై సంచలనం వ్యాఖ్యలు చేసింది. దేశంలోని చాలా మంది అమ్మాయిలు సోమరితనంతో ఉన్నారు అంటూ చెప్పుకొచ్చింది.

Sonali Kulkarni
Sonali Kulkarni : కన్నడ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన సోనాలి కులకర్ణి.. తమిళ, హిందీ, మరాఠి, గుజరాతీ, ఇంగ్లీష్, ఇటాలియన్, కొరియన్ భాషల్లో నటించింది. 70 కు పైగా సినిమాల్లో నటించిన కులకర్ణి నేషనల్ అవార్డుని కూడా అందుకుంది. బుల్లితెర పై కూడా ఆడియన్స్ ని అలరిస్తున్న ఈ భామా.. తాజాగా దేశంలోని ఆడవారి పై సంచలనం వ్యాఖ్యలు చేసింది. దేశంలోని చాలా మంది అమ్మాయిలు సోమరితనంతో ఉన్నారు అంటూ చెప్పుకొచ్చింది.
Ram Charan : నాటు నాటు తెలుగు పాట కాదు ఇండియన్ సాంగ్.. ఢిల్లీలో రామ్‌చరణ్!
బాలీవుడ్ లోని ప్రముఖ యూట్యూబ్ ఛానల్ CoachBSR లో భూపేంద్ర సింగ్ రాథోడ్‌తో కలిసి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ”పురుషులకు 18 సంవత్సరాలు రాగానే కుటుంబాన్ని ఆర్ధికంగా మద్దతు ఇవ్వడానికి విపరీతమైన ఒత్తిడిని ఎదురుకుంటున్నారు. కానీ 25 సంవత్సరాలు వచ్చిన మహిళలు మాత్రం తమ బాయ్ ఫ్రెండ్ ని తమకి కావాల్సినవి తెచ్చిపెట్టమని బలవంతం చేస్తున్నారు.
Oscars 2023 : ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్కార్ అఫీషియల్ ఫాలో అయ్యేది ఆ ఇద్దరి ఇండియన్ హీరోలనే..
అమ్మాయిలు పెళ్లి విషయంలో కూడా.. చేసుకునే అబ్బాయికి సొంత ఇల్లు ఉందా? 50 వేల పై శాలరీ వస్తుందా? అని చూస్తున్నారు. అసలు అమ్మాయిలకి ఏమి కావాలి మంచి అబ్బాయిల? మంచి ఆఫర్ల? అమ్మాయి అయిన అబ్బాయి అయిన కష్ట, సుఖాలను ఇద్దరు సమానంగా పంచుకోవాలి. కానీ అమ్మాయిలు అది వదిలేసి పనికిమాలిన సమస్యలపై మానవ హక్కుల (HR) సిబ్బంది వద్దకు వెళ్తున్నారు” అని కులకర్ణి విమర్శించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుండగా.. కొంతమంది ఆమె మాటలకి మద్దతు తెలుపుతున్నారు. మరికొంత మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు.
The real WOMEN
Sonali kulkarni supremacy #sonalikulkarni pic.twitter.com/O48n7ggg23— RADHE (@BEINGRADHEYA) March 16, 2023