Soniya : బిగ్ బాస్‌లో తన ప్రేమ గురించి చెప్పిన సోనియా.. మూడేళ్ళుగా.. ఎవరో అతను..

తాజాగా సోనియా తన ప్రేమ కథని చెప్పింది.

Soniya : బిగ్ బాస్‌లో తన ప్రేమ గురించి చెప్పిన సోనియా.. మూడేళ్ళుగా.. ఎవరో అతను..

Soniya Reveals her Love Story in Bigg Boss

Updated On : September 19, 2024 / 11:46 AM IST

Soniya : బిగ్ బాస్ సీజన్ 8లో మూడో వారం సాగుతుంది. కంటెస్టెంట్స్ ని రెండు టీమ్స్ గా విడగొట్టడంతో టాస్కుల్లో కొట్టుకునేదాకా అవెళ్తున్నారు. ఈ మధ్యలో కంటెస్టెంట్స్ తో వాళ్ళ ప్రేమ కథలు, వాళ్ళ ఎమోషనల్ కథలు చెప్పిస్తున్నారు. తాజాగా సోనియా తన ప్రేమ కథని చెప్పింది.

నటి సోనియా బిగ్ బాస్ హౌస్ లో ప్రేరణతో మాట్లాడుతూ.. నేను, అతను కలిసి మూడేళ్ళుగా పనిచేస్తున్నాం. నేను మొదలుపెట్టిన ఒక ఎన్జీవోకు అతను వెబ్ డిజైనింగ్ లో సహాయపడ్డాడు. అతను ఒక స్పాన్సర్ గా కూడా సపోర్ట్ చేసాడు. అతను నా జీవితంలోకి వచ్చాక చాలా మార్పులు వచ్చాయి. నేనైతే ఇప్పటికి ప్రపోజ్ చేయలేదు. అతను నా నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాడు అని తెలిపింది.

Also Read : RC 16 Update : చరణ్ RC16 సినిమాకు తమిళ్ స్టార్ కాస్ట్యూమ్ డిజైనర్.. చరణ్ సర్‌తో వర్క్ చేయడం కోసం ఎదురుచూస్తున్నా..

దీంతో సోనియా ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నా అతనికి ఇంకా చెప్పలేదని తెలుస్తుంది. మరి బిగ్ బాస్ అయ్యాక సోనియా ప్రేమకథకు శుభం కార్డు పడుతుందేమో చూడాలి. ఇంతకీ ఆ లక్కీ పర్సన్ ఎవరో అని సోనియా అభిమానులు, బిగ్ బాస్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇక సోనియా ఆర్జీవీ కాంపౌండ్ నుంచి హౌస్ లోకి వచ్చింది. ఆర్జీవీ ప్రొడక్షన్ లో ఆశ, కరోనా లాంటి పలు సినిమాల్లో నటించింది. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక ఇంకా సినిమా ఛాన్సులు వస్తాయేమో చూడాలి.