Sonu Sood New House : హైదరాబాద్ లో ఇల్లు కొన్న సోను సూద్?
ఆపద ఉన్న వారిని ఆదుకోవడంలో సోను సూద్ ముందుంటారన్న విషయం అందరికి తెలిసిందే. కరోనా కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న చాలామంది వలస కులాలను వారి ఇళ్లకు చేర్చారు సోను. తన సొంతడబ్బుతో చాలామంది అవసరాలు తీర్చారు. కరోనా సమయంలో రూ.30 కోట్లకు పైగా తన సొంతడబ్బు ఖర్చు చేశారు.

Sonu Sood New House
Sonu Sood New House : ఆపద ఉన్న వారిని ఆదుకోవడంలో సోను సూద్ ముందుంటారన్న విషయం అందరికి తెలిసిందే. కరోనా కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న చాలామంది వలస కులాలను వారి ఇళ్లకు చేర్చారు సోను. తన సొంతడబ్బుతో చాలామంది అవసరాలు తీర్చారు. కరోనా సమయంలో రూ.30 కోట్లకు పైగా తన సొంతడబ్బు ఖర్చు చేశారు.
ఈయన చేసిన మంచి పనులు కోట్లాదిమంది అభిమానులను సంపాదించి పెట్టాయి. ఇక ఇప్పుడు సోను క్రీజ్ ను సినిమావాళ్లు క్యాష్ చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. అందుకే ఆయన కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. భారీగా పారితోషకం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తెలుగులో వరుస సినిమాలకు సైన్ చేశారు సోను సూద్. దీంతో హైదరాబాద్ లోనే ఉండాల్సి వస్తుంది.
ఈ నేపథ్యంలోనే సొంత ఇంటిని కొనుక్కోవాలని సోను ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్‌లో రూ.10 కోట్లతో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేయబోతున్నట్టు సమాచారం.