Sonu Sood : క్లీన్ ఇండియా.. చీపురు పట్టిన సోనూ సూద్!
బాలీవుడ్ నటుడు సోనూసూద్ చీపురు పట్టారు. షూటింగ్ ప్లేస్ సమీపంలో ఉన్న ఓ ప్రదేశంలో స్థానికులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. ఆకులను తొలగించేందుకు కొత్త టెక్నాలజీ కనుగొన్నారు. చీపురిని కర్రకు కట్టి బల్లెంలా పొడుస్తూ ఆకులను తొలగించారు. ఈ సందర్బంగా సోనూ మాట్లాడుతూ.. ఊడ్చడంలో ఇది కొత్త టెక్నాలజీ అని తెలిపాడు.

Sonu Sood
Sonu Sood : బాలీవుడ్ నటుడు సోనూసూద్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఎదో ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. సోనూ షేర్ చేసిన వీడియోలలో చాలా వరకు వైరల్ అవుతుంటాయి.
తాజాగా ఓ రైతును రిక్షాపై కుర్చోబెట్టుకొని తొక్కాడు.. ఈ సమయంలో సోనూసూద్ రైతుతో మాట్లాడిన తీరు అందరిని ఆకర్షించింది. కొద్దీ గంటల్లోనే ఈ వీడియో లక్షల్లో వ్యూస్ సంపాదించింది.
View this post on Instagram
ఇక ఆ తర్వాత షూటింగ్ లో భాగంగా శ్రీనగర్ వెళ్లారు. అక్కడ ఓ చెప్పుల దుకాణం వ్యక్తితో మాట్లాడి అందుకు సంబందించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
View this post on Instagram
ఇక గురువారం ఓ వీడియో పోస్టు చేశారు.. ఈ వీడియోలో చీపురు పట్టుకొని చెట్టు ఆకులను తొలగిస్తున్నారు సోనూ. ఎవరైనా చీపురుతో ఊడ్చుతారు.. కానీ ఈ వీడియోలో చీపురును బల్లెంలా వాడారు. ఆకులపై చీపురిని పొడిచి కొత్త పద్దతి ద్వారా శుభ్రం చేశారు. దీనిని కొత్త టెక్నాలజీగా అభివర్ణించారు సోనూసూద్.. ఇక ఈ సందర్బంగా సోనూ మాట్లాడుతూ.. ఉడ్చడానికి చాలా సమయం పడుతుంది.
ఓ సారి ఇలా ట్రై చెయ్యండి చాలా త్వరగా మీ పని పూర్తవుతుందని తెలిపాడు. ఇంజినీర్ ఎప్పుడు నేర్చుకుంటే ఉండాలి.. ఆలా నేర్చుకుంటేనే ఇలాంటి ఇన్నోవేషన్స్ బయటకు వస్తాయని అన్నారు . కాగా సోనూసూద్ పోస్ట్ చేసిన ఈ వీడియో గంటల వ్యవధిలోనే పదిలక్షల మంది వీక్షించారు.
View this post on Instagram