ఒక అమ్మాయి కోసం ఆ ఊరికి వైఫై… సోనూసూద్ సాయం

  • Published By: vamsi ,Published On : August 24, 2020 / 01:20 PM IST
ఒక అమ్మాయి కోసం ఆ ఊరికి వైఫై… సోనూసూద్ సాయం

Updated On : August 24, 2020 / 2:22 PM IST

కరోనా కష్ట సమయంలో సాయం చెయ్యడంలో తనవంతు పాత్రను నిర్వహిస్తున్న యాక్టర్ సోనూసూద్.. మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. పరాయి రాష్ట్రాల్లో, దేశాల్లో చిక్కుకున్న ఎందరినో సోను సూద్ సొంత డబ్బులతో రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి సొంతిళ్లకు చేర్చగా.. అప్పటినుంచి సహాయం కోరుతూ ఎవ్వరు సోనూకి ట్వీట్ చేసినా వెంటనే స్పందిస్తున్నారు.



ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా మహారాష్ట్రలోని సింధూ దుర్గ్ గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని కోసం ఊరు మొత్తానికి వైఫై ఏర్పాటు చేశాడు సోనూసూద్. సింధూ దుర్గ్‌కి చెందిన స్వాప్నిల్ ఊళ్లో ఇంటర్నెట్ సిగ్నల్ రాకపోవడంతో ఆమె సోదరుడితో కలిసి 2 కి.మీల దూరంలోని కొండపైకి వెళ్లి చిన్నగుడిసె వేసుకుని ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతోంది.



చదువుకోసం స్వాప్నిల్ పడుతున్న కష్టాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న సోనూ సూద్ ఆమె కోసం ఊరు మొత్తానికి వైఫై సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకున్నాడు. ఆమె వివరాలు తెలుసుకొని వాళ్ల ఊరికి వైఫై వచ్చే ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చాడు.