మనసున్న మారాజు.. సాయం కోసం ఆస్తులు తాకట్టు పెట్టిన సోనూ సూద్..

  • Published By: sekhar ,Published On : December 9, 2020 / 05:21 PM IST
మనసున్న మారాజు.. సాయం కోసం ఆస్తులు తాకట్టు పెట్టిన సోనూ సూద్..

Updated On : December 9, 2020 / 6:04 PM IST

Sonu Sood Mortgages Juhu Properties: సోనూ సూద్.. కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు ఇది.. లాక్ డౌన్ సమయంలో ఆయన చేసిన సహాయ సహకార కార్యక్రమాలు మరెవరూ చేయలేదు.. ఎందరో ప్రజల్ని ఎన్నో రకాలుగా ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్నారు. ఇప్పటికీ అవసరం ఉన్నవారికి హెల్ప్ చేస్తూనే ఉన్నారాయన. ఇప్పుడు తన ఆస్తులను సైతం తాకట్టు పెట్టారనే వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది..



వివరాళ్లోకి వెళ్తే.. ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్న సోనూ సూద్ తన చేతిలోని డబ్బులు అయిపోవడంతో ముంబైలోని జూహూ ప్రాంతంలోగల తన ఆస్తులను తాకట్టు పెట్టి రూ.10 కోట్లు అప్పుగా తీసుకుని.. ఆ డబ్బుతోనే అందరికీ సాయం అందిస్తూ వచ్చారట. సెప్టెంబర్ 15 న ఒప్పందం ప్రకారం సంతకం చేయగా.. నవంబర్ 24 న రిజిష్టర్ చేయబడిందని, రుణం పెంచడానికి 5 లక్షల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించారని తెలుస్తోంది.



దీని గురించి జెఎల్‌ఎల్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్, హెడ్ రితేష్ మెహతా మాట్లాడుతూ ‘‘ఆస్తులన్నీ సోనూ సూద్, అతని భార్య పేరు పైనే ఉన్నాయి. దీనికి సంబంధించిన రెంటల్‌ కూడా వారు అందుకుంటున్నారు. తాకట్టు తర్వాత రూ.10 కోట్లకు వడ్డీ, అసలు చెల్లించాల్సి ఉంది’’ అని అన్నారు. అయితే ఈ విషయంపై సోనూ సూద్‌ స్పందించలేదు. ఆపదలో ఉన్నవారికి సాయమందించడానికి ఆస్తులు తనఖా పెట్టారనే విషయం తెలియగానే సోనూ నుండి సాయం పొందినవారు, నెటిజన్లు ఆయణ్ణి ప్రశంసిస్తున్నారు.