Sreeleela : గోదాదేవిగా శ్రీలీల.. భరతనాట్యంతో అందర్నీ మైమరిపించిన శ్రీలీల.. ఎంత అద్భుతంగా చేసిందో..

హైదారాబాద్‌లో జరిగిన సమతా కుంభ్ 2024 కార్యక్రమంలో శ్రీలీల.. గోదా దేవి వేషధారణలో క్లాసికల్ డ్యాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Sreeleela : గోదాదేవిగా శ్రీలీల.. భరతనాట్యంతో అందర్నీ మైమరిపించిన శ్రీలీల.. ఎంత అద్భుతంగా చేసిందో..

Sreeleela Classical Dance Performance in Hyederabad Samatha Kumbh Event

Updated On : March 2, 2024 / 5:21 PM IST

Sreeleela : శ్రీలీల ఇన్ని రోజులు వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరించింది. తన నటన, డ్యాన్సులతో అభిమానులని ఆకట్టుకుంది. ఇటీవల సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో వచ్చి హిట్ కొట్టింది. ఇక శ్రీలీల డ్యాన్స్ గురించి అందరికి తెలిసిందే. హీరోలు కూడా ఆమె డ్యాన్స్ పక్కన తేలిపోతారు. ఆ రేంజ్ లో డ్యాన్స్ చేస్తుంది శ్రీలీల. తను క్లాసికల్ డ్యాన్సర్ అని గతంలోనే చెప్పింది. క్లాసికల్ డ్యాన్స్ లో కూడా శ్రీలీల అదరగొడుతుంది అని తాజాగా మరోసారి ప్రూవ్ చేసింది.

హైదారాబాద్‌లో జరిగిన సమతా కుంభ్ 2024 కార్యక్రమంలో శ్రీలీల.. గోదా దేవి వేషధారణలో క్లాసికల్ డ్యాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దాదాపు 10 నిమిషాల పాటు తన నాట్యంతో ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేసింది. ప్రస్తుతం శ్రీలీల చేసిన నాట్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఎంత అద్భుతంగా చేసిందో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.దీనిపై శ్రీలీల తన క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఫోటోలను షేర్ చేసి.. నేను చాలా చిన్నప్పటి నుంచే క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాను. ఇది నా ఫేవరేట్ హాబీ. ఇది నాకు చాలా నేర్పించింది. మళ్ళీ చాలా కాలం తర్వాత ఇలా పర్ఫార్మెన్స్ ఇచ్చాను. గోదాదేవిగా నిన్న పర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఒకప్పుడు నేను డ్యాన్స్ చేసేటప్పుడు నా ఫ్యామిలీ మాత్రమే చూసేవారు. ఇప్పుడు మీరంతా నా ఫ్యామిలీ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Also Read : Ram Charan Upasana : చరణ్ భార్య పాదాలను పట్టుకొని.. ఎంత గ్లోబల్ స్టార్ అయినా భార్యకు దాసుడే.. క్యూట్ వీడియో వైరల్..

గతంలో చిన్నప్పుడు క్లాసికల్ డ్యాన్స్ చేసిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. మళ్ళీ ఇన్నాళ్ళకి తను చేసిన క్లాసికల్ డ్యాన్స్ వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక శ్రీలీల చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నట్టు సమాచారం. ఇన్నాళ్లు వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల ఇప్పుడు మాత్రం కొద్దిగా స్లో అయింది. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ బయట షాప్ ఓపెనింగ్స్ లాంటి వాటితో కనిపిస్తుంది.