Sreeleela : విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీలీల డ్రాప్ అయ్యిందా..?
విజయ్ దేవరకొండ VD12 సినిమా నుంచి శ్రీలీల తప్పుకుందట.

Sreeleela drop down from Vijay Deverakonda VD12 movie
Sreeleela : ఎనర్జిటిక్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యిపోయింది. నవీన్ పోలిశెట్టి నుంచి పవన్ కళ్యాణ్ వరకు ప్రతి హీరో సినిమాలో ఈ భామ హీరోయిన్ గా కావాల్సిందే. ఈక్రమంలోనే ఈ అమ్మడి చేతిలో అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి. వీటిలో కొన్ని సినిమాలు సెట్స్ పైన ఉంటే.. కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. కాగా శ్రీలీల ఇటీవల విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) VD12 సినిమాకి కూడా సైన్ చేసిన సంగతి తెలిసిందే.
Game Changer : గేమ్ చెంజర్ అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు.. సెప్టెంబర్ షూట్ అందుకే క్యాన్సిల్ అయ్యింది..
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఆల్రెడీ లాంచ్ అయ్యింది. ఈ ఈవెంట్ లో శ్రీలీల కూడా పాల్గొంది. ఇక ఈ మూవీ షూటింగ్ కూడా సైలెంట్ గా జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం నుంచి ఇప్పుడు శ్రీలీల తప్పుకున్నట్లు తెలుస్తుంది. డేట్స్ సర్దుబాటు చేయలేక శ్రీలీల ఈ సినిమా నుంచి డ్రాప్ అయ్యినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే మూవీ టీం నుంచి ఈ విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే, శ్రీలీల.. రవితేజ సినిమాకి కూడా నో చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.
Lucky Baskhar : మొదలైన దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ షూట్..
రవితేజతో ‘ధమాకా’ బ్లాక్ బస్టర్ కొట్టి సింగల్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయ్యిపోయిన శ్రీలీల.. మళ్ళీ రవితేజతో ఛాన్స్ వస్తే నో చెప్పిందని తెలుస్తుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ కోసం శ్రీలీలని సంప్రదించారట. అయితే డేట్స్ లేకపోవడం వలనే శ్రీలీల ఈ సినిమాకి నో చెప్పిందని తెలుస్తుంది. కాగా ప్రస్తుతం శ్రీలీల నటిస్తున్న సినిమాలు కూడా కొన్ని కారణాలు వల్ల షూటింగ్ లేట్ అవుతూ వస్తున్నాయి. దీంతో ఈ అమ్మడికి కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయడం ఇబ్బంది అవుతుంది.