Chiranjeevi-Sreeleela : చిరు, శ్రీలీల డ్యాన్స్ .. బాక్సాఫీస్ బద్దలే..
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ రాబోతుంది.

Sreeleela Gets A Chance To Dance With Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ రాబోతుంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్న ఆ సినిమాపై రోజుకో గాసిప్ వైరల్ అవుతోంది. ఈ మూవీలో చిరుకు జోడీగా లేడీ సూపర్‌స్టార్ నయనతారను ఇప్పటికే కన్ఫామ్ చేశారు. ఇప్పటి నుంచే ఆమె ప్రమోషన్స్‌లో అదరగొడుతున్నారు. అయితే చిరు, అనిల్ రావిపూడి సినిమాపై ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. యంగ్ డ్యాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల ఈ మూవీలో చిరంజీవితో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేయనుందట.
శ్రీలీల, తన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ఇప్పటికే గుంటూరు కారంలో యూత్‌ను ఊపేసింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో స్పెషల్ సాంగ్‌లో ఆమె స్టెప్పులేస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందేనంటున్నారు ఫ్యాన్స్. చిరు ఐకానిక్ బ్రేక్ డ్యాన్స్‌కు, శ్రీలీల గ్రేస్‌ఫుల్ ఎనర్జీ తోడైతే..ఆ సాంగ్ స్క్రీన్‌పై మరో సెన్సేషన్ కావడం ఖాయమంటున్నారు. ఈ స్పెషల్ సాంగ్‌ను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేస్తున్నారని, ఇది మాస్ బీట్స్‌తో పాటు చిరు-శ్రీలీల డ్యాన్స్‌కు సూటయ్యేలా డిజైన్ చేశారని టాక్.
Vijaya Bhanu : నిన్నటి తరం మేటి నటి, నృత్యకళాకారిణి విజయభాను కన్నుమూత..
అనిల్ రావిపూడి గతంలో భగవంత్ కేసరిలో శ్రీలీల డాన్స్‌ను హైలైట్ చేసిన తీరును గుర్తు చేస్తూ, ఈసారి చిరుతో ఆమె స్టెప్పులు మరో లెవెల్‌లో ఉంటాయని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. శ్రీలీల స్పీడ్, చిరు స్టైల్ కలిస్తే..ఈ సాంగ్ యూట్యూబ్‌లో వ్యూస్ రికార్డులు బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు.
8 Vasantalu : అనంతిక సనీల్ కుమార్ ‘8 వసంతాలు’ నుంచి మరో టీజర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే..?
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఫుల్ స్వింగ్‌లో సాగుతోంది. నయనతారతో చిరు రొమాన్స్, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, శ్రీలీల డాన్స్ స్టెప్పులతో సంక్రాంతి రేసులో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. స్పెషల్ సాంగ్‌లో తన డ్యాన్స్‌తో శ్రీలీల ఎలాంటి మ్యాజిక్ చేస్తుంది.? చిరుతో ఆమె స్టెప్పులు ఎలా సెట్ అవుతాయో చూడాలి మరి.