Vijaya Bhanu : నిన్నటి తరం మేటి నటి, నృత్యకళాకారిణి విజయభాను కన్నుమూత..
విజయభాను.. ఈ పేరు ఇప్పటి తరం వారికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ 70వ దశకంలో ఆమె ఓ వెలుగు వెలిగారు.

Vijaya Bhanu passed away at 68
విజయభాను.. ఈ పేరు ఇప్పటి తరం వారికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ 70వ దశకంలో ఆమె ఓ వెలుగు వెలిగారు. అప్పటి అగ్రకథానాయకులు అందరి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సాధించారు. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ బాషల్లో కేవలం పదేళ్ల వ్యవధిలోనే వందకు పైగా చిత్రాల్లో నటించి ఔరా అని అనిపించారు.
చిరంజీవి, కమల్ హాసన్, జయసుధలతో కె. బాలచందర్ తెరక్కించిన దృశ్యకావ్యం “ఇది కథ కాదు” చిత్రలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఈ చిత్రంలో ఆమె నటనటకు గానూ “ఉత్తమ సహాయ నటి”గా నంది పురస్కారాన్ని అందుకున్నారు.
8 Vasantalu : అనంతిక సనీల్ కుమార్ ‘8 వసంతాలు’ నుంచి మరో టీజర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే..?
కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే ఓ అమెరికన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భారతదేశాన్ని విడిచిపెట్టి అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో సెటిల్ అయ్యారు. స్వతహాగా నాట్యకారిణి కావడంతో పాటు…’నాట్యమయూరి’ బిరుదాంకితురాలైన ఆమె లాస్ ఏంజెల్స్ లో ‘శ్రీ శక్తి శారదా నృత్యనికేతన్’ పేరుతో నృత్య కళాశాల స్థాపించారు. ఎంతో మందికి నాట్యాన్ని నేర్పించారు.
భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథాకేళి వంటి నృత్యరీతులలోనూ నిష్ణాతురాలైన విజయభాను ప్రపంచవ్యాప్తంగా లెక్కకుమిక్కిలిగా నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. అయితే.. ఆమె గత నెలలో ఇండియాకు తిరిగి వచ్చారు. చెన్నైలోని తన నివాసాన్ని చూసేందుకు వెళ్లిన ఆమె ఎండ వేడి తట్టుకోలేక అస్వస్థతకు గురి అయ్యారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె వయస్సు 68 సంవత్సరాలు.
విజయభాను ఆకస్మిక మరణం పట్ల ప్రముఖ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద, నటుడు సుమన్, ప్రముఖ దర్శకనిర్మాత వై.వి.ఎస్.చౌదరి తదితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు.