Sreeleela : భగవంత్ కేసరి సినిమా చేయొద్దని చాలా మంది చెప్పారు.. అన్‌స్టాపబుల్ లో శ్రీలీల సంచలన వ్యాఖ్యలు..

ఆహా ఓటీటీ బాలయ్య బాబు అన్‌స్టాపబుల్ సీజన్ 3లో మొదటి ఎపిసోడ్ నిన్న 17వ తేదీ రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అన్‌స్టాపబుల్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీం కాజల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, అనిల్ రావిపూడి వచ్చి సందడి చేశారు.

Sreeleela : భగవంత్ కేసరి సినిమా చేయొద్దని చాలా మంది చెప్పారు.. అన్‌స్టాపబుల్ లో శ్రీలీల సంచలన వ్యాఖ్యలు..

Sreeleela Sensational Comments on Bhagavanth Kesari Movie in Unstoppable with NBK Show

Updated On : October 18, 2023 / 6:30 AM IST

Sreeleela : ఆహా(Aha)ఓటీటీలో బాలకృష్ణ(Balakrishna) హోస్ట్ గా చేసిన అన్‌స్టాపబుల్ విత్ NBK టాక్ షో సీజన్ 1, సీజన్ 2 రెండూ ఎంత సూపర్ హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. అన్‌స్టాపబుల్ విత్ NBK సరికొత్త రికార్డులని సృష్టించడమే కాక బాలయ్య బాబులోని ఇంకో కోణాన్ని చూపిస్తూ బోలెడంత మంది స్టార్స్ ని తీసుకొచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు సీజన్ 3 కూడా మొదలైంది.

ఆహా ఓటీటీ బాలయ్య బాబు అన్‌స్టాపబుల్ సీజన్ 3లో మొదటి ఎపిసోడ్ నిన్న 17వ తేదీ రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అన్‌స్టాపబుల్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీం కాజల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, అనిల్ రావిపూడి వచ్చి సందడి చేశారు. ఈ ఎపిసోడ్ లో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని తెలియచేశారు.

Also Read : Bigg Boss 7 Day 44 : ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు? భోలే వర్సెస్ శోభాశెట్టి, ప్రియాంక..

ఈ షోలో బాలయ్య.. ఈ సినిమాని ఎందుకు ఒప్పుకున్నావు అని శ్రీలీలను అడగ్గా.. పెళ్లి సందడి సినిమా తర్వాతే నేను ఈ కథ విన్నాను. అప్పటికే నాకు హీరోయిన్ గా వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇందులో కూతురి పాత్ర. హీరోయిన్ గా ఆఫర్స్ వస్తున్నప్పుడు కూతురి పాత్ర ఎందుకు, ఈ సినిమా చెయ్యొద్దు, నో చెప్పు అని చాలా మంది చెప్పారు. కానీ హీరోయిన్ గా ఒకటి పోతే ఇంకో ఆఫర్ రావొచ్చు. కానీ ఇలాంటి పాత్రలు వదులుకుంటే మళ్ళీ వస్తాయో రావో తెలీదు. అందుకే వచ్చినప్పుడు ఒప్పేసుకున్నాను. నా కెరీర్ లో నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఏదైనా ఉందంటే అది ఈ సినిమా ఒప్పుకోవడమే అని చెప్పింది. దీంతో శ్రీలీల చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.