BiggBoss Non Stop : ముమైత్ నా చెయ్యి విరగ్గొట్టింది.. బిగ్‌బాస్ లో పాతవి గుర్తుచేసుకొని ఏడ్చేసిన శ్రీరాపాక

నటి శ్రీరాపాక తోటి కంటెస్టెంట్స్ తో ముమైత్ ఖాన్ తో గతంలో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతూ ఏడ్చేసింది. శ్రీరాపాక మాట్లాడుతూ.. ''మూడేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో ముమైత్‌ ఖాన్‌ నా చేయి...

BiggBoss Non Stop : ముమైత్ నా చెయ్యి విరగ్గొట్టింది.. బిగ్‌బాస్ లో పాతవి గుర్తుచేసుకొని ఏడ్చేసిన శ్రీరాపాక

Sreerapaka

 

BiggBoss Non Stop :  డిస్నిప్లస్ హాట్‌స్టార్‌లో ఇటీవల ప్రారంభమైన బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ లో అప్పుడే గొడవలు మొదలయ్యాయి. నామినేషన్ల పర్వం కూడా జరిగింది. ఈ సారి బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ లో పాత కంటెస్టెంట్స్ వర్సెస్ కొత్త కంటెస్టెంట్స్ అన్నట్టు సాగుతుంది. ఇందులో మాజీ కంటెస్టెంట్లు వారియర్స్‌గా, కొత్త కంటెస్టెంట్లు చాలెంజర్స్‌గా పిలుస్తున్నారు. మొదటి వారం నామినేషన్స్ అయిన తర్వాత కంటెస్టెంట్ల మధ్య అప్పుడే మనస్పర్థలు పెరిగాయి.

ఈ క్రమంలో నటి శ్రీరాపాక తోటి కంటెస్టెంట్స్ తో ముమైత్ ఖాన్ తో గతంలో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతూ ఏడ్చేసింది. శ్రీరాపాక మాట్లాడుతూ.. ”మూడేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో ముమైత్‌ ఖాన్‌ నా చేయి విరగ్గొట్టింది. అప్పుడు నా చేయి వాచిపోయింది. దీనికి ఆర్జే చైతూనే సాక్ష్యం. ఆ సమయంలో చైతూ, కాజల్‌ కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు వారిద్దరూ కూడా నాకేం సహాయం చేయలేదు, నా వైపు చూస్తూ నిలబడ్డారు. అయినా సరే ఆ విషయాన్ని నేను అక్కడితో వదిలేశాను. కానీ ముమైత్‌ ఇంకా దాన్నే మనసులో పెట్టుకుంది.”

Srnivasa Raju : రవితేజ మేనేజర్ కూతుళ్ళ హాఫ్ శారీ ఫంక్షన్‌లో సెలబ్రిటీల సందడి

”ఇప్పుడు బిగ్‌బాస్‌కు వచ్చాక ముమైత్ నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. నేనే స్వయంగా ఆమె దగ్గరకు వెళ్లినా కూడా సరిగ్గా మాట్లాడట్లేదు. పైగా నన్ను లయర్‌ అని అంది. నా శరీరానికి గాయం చేసినా నేను అంతగా పట్టించుకోలేదు. కానీ ముమైత్ మాత్రం అదే విషయాన్ని ఇంకా పట్టుకుని నన్ను అంత మాట అనేసింది. చీటింగ్‌, లయర్‌ అనేవి నాకు నచ్చని పదాలు. ఆ మాట నన్ను అంటే నేను భరించలేకపోతున్నాను” అంటూ తోటి కంటెస్టెంట్స్ వద్ద తన బాధను చెప్పుకుంటూ ఏడ్చేసింది శ్రీరాపాక. ఇలా బిగ్‌బాస్ ఆరంభంలోనే ఏడుపులు, గొడవలు మొదలయ్యాయి.