Srikanth : 100కి పైగా సినిమాలు.. కానీ మొదటిసారి తమిళ సినిమా చేస్తున్నా.. వారసుడు సినిమాపై శ్రీకాంత్ వ్యాఖ్యలు..

వారసుడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీకాంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. వారసుడు ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్ సినిమా. విజయ్ ఇటీవల ఇలాంటి ఫ్యామిలీ సినిమా చేయలేదు, తప్పకుండా.............

Srikanth : 100కి పైగా సినిమాలు.. కానీ మొదటిసారి తమిళ సినిమా చేస్తున్నా.. వారసుడు సినిమాపై శ్రీకాంత్ వ్యాఖ్యలు..

srikanth comments on vijay varasudu movie

Updated On : January 4, 2023 / 10:27 AM IST

Srikanth :  ఒకప్పటి స్టార్ హీరో శ్రీకాంత్ దాదాపు 100కి పైగా సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులని మెప్పించాడు. హీరోగా కెరీర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టారు. ఇటీవల అఖండ సినిమాలో విలన్ గా మెప్పించారు. త్వరలో మరిన్ని సినిమాల్లో కూడా స్టార్ విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు.

తమిళ స్టార్ హీరో విజయ్ తో వారసుడు సినిమాలో శ్రీకాంత్ నటించాడు. విజయ్, రష్మిక మందన్న జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తమిళ్ లో వరిసు పేరుతో తెరకెక్కుతున్న సినిమా తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ అవ్వబోతుంది. ఈ సంక్రాంతికి తెలుగు స్టార్ హీరోలతో పోటీగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు దిల్ రాజు. దీంతో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

Food entry in Theaters : సినిమాహాళ్లలో బయటి ఫుడ్ నిషేధాన్ని సమర్ధించిన సుప్రీంకోర్ట్.. కానీ..

వారసుడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీకాంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. వారసుడు ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్ సినిమా. విజయ్ ఇటీవల ఇలాంటి ఫ్యామిలీ సినిమా చేయలేదు, తప్పకుండా అందరికి నచ్చుతుంది. సంక్రాంతి పండగకి ఒక పండగలాంటి సినిమా రాబోతుంది. ఇప్పటివరకు 100కి పైగా తెలుగు సినిమాల్లో నటించాను విజయ్ వారసుడు సినిమాతో తమిళ పరిశ్రమకి పరిచయం అవ్వబోతున్నాను. ఒక మంచి భారీ సినిమాతో తమిళ్ లో ఎంట్రీ ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమా మొత్తం నా పాత్ర ఉంటుంది. విజయ్ ఎక్కువగా మాట్లాడరు. కారవాన్ కూడా ఎక్కువగా వాడరు. సెట్ లోకి ఒక్కసారి అడుగుపెట్టారంటే ప్యాకప్ చెప్పేదాకా ఇంకో ధ్యాస ఉండదు. చాలా అంకితభావంతో పనిచేస్తారు. ఇన్నాళ్ల నుంచి దిల్ రాజు బ్యానర్లో కూడా సినిమాలు చేయలేదు. కానీ ఇప్పుడు ఒకేసారి వారసుడు, రామ్ చరణ్-శంకర్ సినిమాలు చేస్తున్నాను అని తెలిపారు.