Gopichand 32 : ఇంత స్పీడా..? గోపీచంద్‌తో శ్రీను వైట్ల మూవీ అప్పుడే..!
శ్రీను వైట్ల దర్శకత్వంలో మాచో స్టార్ గోపీచంద్ చేస్తున్న మూవీ ఇటీవలే షూటింగ్ ని మొదలు పెట్టుకొని అప్పుడే..

Srinu Vaitla Gopichand 32 movie completes first schedule shooting
Gopichand 32 : శ్రీను వైట్ల దర్శకత్వంలో మాచో స్టార్ గోపీచంద్ ఇటీవల ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ని శ్రీను వైట్ల శరవేగంగా ముందుకు తీసుకు వెళ్తున్నాడు. ఇటీవల ఇటలీలో ఈ మూవీ మొదటి షెడ్యూల్ కోసం లొకేషన్స్ ఫైనల్ చేసిన శ్రీను వైట్ల.. ఆ వెంటనే షూటింగ్ ని కూడా మొదలు పెట్టేశాడు. చిత్రీకరణ ఇలా మొదలు పెట్టాడో లేదో షెడ్యూల్ ని యమా స్పీడ్ లో పూర్తి చేసేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ట్వీట్ చేస్తూ తెలియజేసింది.
ఇటలీలో ఈ మూవీలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. అలాగే హీరోహీరోయిన్స్ తో సాంగ్ షూట్ ని కూడా పూర్తి చేసేశారు. ఈ మూవీలో చేయబోయే హీరోయిన్ గురించి ఇప్పటివరకు మేకర్స్ తెలియజేయలేదు. తాజాగా చేసిన పోస్టుతో హీరోయిన్ ఎవరనేది వెల్లడించారు. ఈ మూవీలో ‘కావ్య తపర్’ గోపీచంద్ కి జంటగా కనిపించబోతుంది. ఇక వీరిద్దరి మధ్య ఒక సాంగ్ ని శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీలో అక్కడ అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు. ఈ సినిమాకి చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.
Also read : Rocking Rakesh : రాకింగ్ రాకేష్ హీరోగా మొదటి మూవీ.. KCR గా కనిపించబోతున్న..
#Gopichand32 wraps up a key schedule in the beautiful city of Milan ❤
An entertaining extravaganza loading ?
Stay tuned for exciting updates ❤?@YoursGopichand @SreenuVaitla @VenuDonepudi @Gopimohan @kvguhan @chaitanmusic @Sekharmasteroff #RaviVarmaMaster @amarreddy0827 pic.twitter.com/fC3XRr1Qog
— Chitralayam Studios (@ChitralayamS) October 13, 2023
#Gopichand32 wraps up a key schedule in the beautiful city of Milan ❤
An entertaining extravaganza loading ?
Stay tuned for exciting updates ❤?@YoursGopichand @SreenuVaitla @Gopimohan @chaitanmusic @ChitralayamS pic.twitter.com/SlD6ApCkFW
— kakinada Talkies (@Kkdtalkies) October 13, 2023
గోపీచంద్ 32వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చిత్రాలయం స్టూడియోస్ నిర్మిస్తుంది. కాగా గోపీచంద్, శ్రీనువైట్ల ప్రస్తుతం ప్లాప్ ల్లో ఉన్నారు. దీంతో కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఇద్దరు గట్టిగానే కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. అయితే గోపీచంద్ ఈ సినిమా కంటే ముందే మరో మూవీతో ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. కన్నడ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో ‘భీమ’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనపడబోతున్నాడు.