Srivalli Song: గూగుల్ సెర్చ్‌లో దుమ్ములేపిన శ్రీవల్లి సాంగ్.. ఎన్నో ప్లేస్‌లో ఉందో తెలుసా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. ఈ సినిమాలో అన్ని పాటలు కూడా చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా శ్రీవల్లి పాట కుర్రకారును ఓ ఊపుఊపేసింది. అయితే ఇప్పుడు ఇదే పాట పుష్ప చిత్రానికి ఓ అరుదైన ఖ్యాతిని తీసుకొచ్చి పెట్టింది.
Srivalli Song: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీగా పుష్ప బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో చెడుగుడు ఆడేసుకున్నాడు.
Srivalli Song : పుష్ప , శ్రీవల్లీలని అచ్చు దింపేసిన బాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్, హీరోయిన్
ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో బలంగా నిలిచింది. ఈ సినిమాలో అన్ని పాటలు కూడా చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా శ్రీవల్లి పాట కుర్రకారును ఓ ఊపుఊపేసింది. అయితే ఇప్పుడు ఇదే పాట పుష్ప చిత్రానికి ఓ అరుదైన ఖ్యాతిని తీసుకొచ్చి పెట్టింది. 2022లో గూగుల్ సెర్చ్‌లో ఎక్కువగా వెతికిన పాటల్లో టాప్ టెన్‌లో శ్రీవల్లి సాంగ్ కూడా ఉండటం విశేషం. అయితే శ్రీవల్లి పాటను తెలుగులో వెతికిన వారికంటే హిందీలో వెతికిన వారే ఎక్కువ.
Pushpa : ముంబై పోలీసుల మ్యూజిక్ బ్యాండ్.. ‘పుష్ప’ శ్రీవల్లి సాంగ్ రీక్రియేషన్..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజిక్ ఆల్బమ్స్‌లో శ్రీవల్లి సాంగ్ టాప్ 10వ స్థానంలో నిలవడం విశేషమని చెప్పాలి. ఇక ఈ హిందీ వర్షన్ పాటను జావెద్ అలీ అత్యద్భుతంగా ఆలపించారు. కాగా, తాజాగా పుష్ప చిత్రాన్ని రష్యన్ భాషలో రిలీజ్ చేస్తుండగా, చిత్ర యూనిట్ రష్యాలో ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.