Mahesh Babu : రాజమౌళి సినిమా కంటే ముందే.. మహేష్ బాబు హాలీవుడ్ రేంజ్ యాక్షన్..

మహేష్ బాబు, రాజమౌళి సినిమా కంటే ముందే హాలీవుడ్ రేంజ్ యాక్షన్ తో అదరగొడుతున్నారు.

Mahesh Babu : రాజమౌళి సినిమా కంటే ముందే.. మహేష్ బాబు హాలీవుడ్ రేంజ్ యాక్షన్..

SSMB29 star Mahesh Babu hollywood range action sequence video

Updated On : March 10, 2024 / 8:40 AM IST

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా రాజమౌళి సినిమా ఎదురు చూస్తుంటే.. మహేష్ మాత్రం యాడ్స్, ఫోటోషూట్స్ చేస్తూ కాలం గడుపుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి మహేష్ తన ఇన్‌స్టాగ్రామ్ లో వరుసగా కొత్త ఫోటోలను షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ ఫోటోషూట్స్ తో పాటు కొన్ని యాడ్స్ షూటింగ్స్ కూడా చేస్తున్నారు. ఈక్రమంలోనే రీసెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో అభి బస్ యాడ్ చేసారు.

తాజాగా మహేష్ తన కొత్త యాడ్ వీడియోని షేర్ చేసారు. ఆ యాడ్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ని తలపిస్తుంది. మహేష్ బాబు ‘మౌంటెన్ డ్యూ’ కూల్ డ్రింక్ కి బ్రాండ్ అంబాసడర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్రాండ్ కి సంబంధించిన కొత్త యాడ్ ని మహేష్ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఈ యాడ్ లోని యాక్షన్ సీన్స్ తో పాటు మహేష్ లుక్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి.

Also read : Miss World Winner 2024 : 28 ఏళ్ల తర్వాత ఇండియాలో.. ఈ ఇయర్ మిస్ వరల్డ్ ఎవరు..?

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

ఇక SSMB29 విషయానికి వస్తే.. కె ఎల్ నారాయణ, ఎస్ గోపాల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇండియానా జోన్స్ తరహాలో అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో తెరకెక్కబోతుంది. హాలీవుడ్ మూవీ స్థాయిలో ఈ చిత్రాన్ని రాజమౌళి రూపొందించబోతున్నారు. ఈ ఏడాది మే నెలలో ఈ మూవీ గ్రాండ్ గా లాంచ్ కాబోతుందని సమాచారం. ఇక ఈ లాంచ్ ఈవెంట్ కి వరల్డ్ టాప్ డైరెక్టర్ ‘జేమ్స్ కామెరాన్’ ముఖ్య అతిథిగా రాబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు.