AR Rahaman : విడాకుల తర్వాత ఫేవరేట్ కార్ కొనుక్కున్న ఏఆర్ రహమాన్.. రేటు ఎంతో తెలుసా? నంబర్ ప్లేట్ మీద..

ప్రస్తుతం రహమాన్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగానే ఉన్నాడు.

AR Rahaman : విడాకుల తర్వాత ఫేవరేట్ కార్ కొనుక్కున్న ఏఆర్ రహమాన్.. రేటు ఎంతో తెలుసా? నంబర్ ప్లేట్ మీద..

Star Music Director AR Rahaman buys his Favorite Car Shares Photo with it

Updated On : April 18, 2025 / 6:19 PM IST

AR Rahaman : మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతం ఇచ్చి, తన పాటలతో ప్రేక్షకులను మెప్పించాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్. ఏకంగా ఆస్కార్ అవార్డు సాధించి రికార్డ్ కూడా సెట్ చేసాడు. ప్రస్తుతం రహమాన్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగానే ఉన్నాడు.

గత సంవత్సరం నవంబర్ లో తన 29 ఏళ్ళ వివాహ బంధానికి స్వస్తి చెప్తూ సైరా భానుతో విడాకులు తీసుకున్నారు రహమాన్. ఆ సమయంలో కొన్ని రోజులు వార్తల్లో నిలిచారు. తాజాగా రహమాన్ ఓ ఖరీదైన, తన ఫేవరేట్ కార్ ని కొనుక్కున్నారు. ఈ మేరకు తాను కొనుక్కున్న కార్ తో ఫోటో దిగి రహమాన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

Also Read : Pushpa 2 : పుష్ప 2 VFX వీడియో చూశారా..? సినిమా మొత్తం గ్రాఫిక్సే కదరా.. వీడియో వైరల్..

కార్ తో దిగిన ఫోటో షేర్ చేసి రహమాన్.. ప్రస్తుతం నా ఫేవరేట్ కార్ ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ మహీంద్రా XEV9e ని కొనుక్కున్నాను. ఈ స్టైలిష్ ఇండియన్ కార్ కోసం మేము సౌండ్ ని కూడా డిజైన్ చేసాం అని రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక రహమాన్ కొన్న కార్ ఖరీదు దాదాపు 30 లక్షల రూపాయలు అని తెలుస్తుంది.

అయితే రహమాన్ షేర్ చేసిన ఫొటోలో కార్ నంబర్ ప్లేట్ లో నంబర్ లేకుండా ARR అని ఉండటంతో చర్చగా మారింది. ఇలా ఉంటే ఫైన్ వేస్తారు కదా అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. లేటెస్ట్ గానే కొన్నాడు కాబట్టి అలా పెట్టుకున్నాడు, ఇంకా రిజిస్ట్రేషన్ నంబర్ రాలేదు, వచ్చాక నంబర్ ప్లేట్ పెడతాడేమో అని తెలుస్తుంది.

 

Also See : Pooja Hegde : చాన్నాళ్లకు చీరకట్టులో క్యూట్ గా పూజ హెగ్డే.. ఫోటోలు వైరల్..