Bheemla Nayak: బెనిఫిట్ షో వేస్తే కఠిన చర్యలే.. ఏపీ ప్రభుత్వం నోటీసులు

పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘భీమ్లా నాయక్’.

Bheemla Nayak: బెనిఫిట్ షో వేస్తే కఠిన చర్యలే.. ఏపీ ప్రభుత్వం నోటీసులు

Bheemla Nayak

Updated On : February 24, 2022 / 7:14 AM IST

Bheemla Nayak: పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘భీమ్లా నాయక్’. త్రివిక్రమ్ మాటలు రాయగా, సాగర్ కే చంద్ర దర్శకత్వలో ‘భీమ్లా నాయక్’ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్లతో సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించనుందని అంచనా.

Bheemla Nayak : డప్పు వాయించిన పవన్ కళ్యాణ్ , కేటీఆర్

అభిమానుల కోరిక మేరకు చాలా ప్రాంతాలలో శుక్రవారం ఉదయాన్నే బెనిఫిట్ షోలు ప్రదర్శించనున్నారు. చాలా కాలంగా ప్రభుత్వానికి.. మేకర్స్ కు మధ్య ఈ బెనిఫిట్ షోపై చర్చలు సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వంతో స్టార్స్ భేటీ అనంతరం దీనికి ముగింపు ఉంటుందని కూడా అంచనా వేశారు. తాజాగా ‘భీమ్లా నాయక్’ సినిమాకి తెలంగాణ ప్రభుత్వం అయిదవ షోకి పర్మిషన్ ఇస్తూ నోటిస్ విడుదల చేసింది.

Bheemla Nayak : డప్పు వాయించిన పవన్ కళ్యాణ్ , కేటీఆర్

అయితే.. ఏపీలో మాత్రం దీనికి అనుమతి దక్కినట్లు లేదు. అనుమతి ఇవ్వకపోగా ఏ థియేటర్లు అయినా బెనిఫిట్ షో వేస్తే కఠిన చర్యలు తప్పవని కూడా నోటీసులు ఇచ్చారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నోటీసు ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గుడ్లవల్లేరు మండల హెడ్ క్వార్ట్రర్ లోని రామకృష్ణ థియేటర్ కు ఈ నోటీసులు ఇచ్చినట్లుగా అందులో పేర్కొనబడింది. ఇక్కడ బెనిఫిట్ షో ప్రదర్శిస్తే కనుక గుడివాడ రెవెన్యూ డివిజనల్ అధికారి.. గుడ్లవల్లేరు స్టేషన్ గౌస్ ఆఫీసర్ చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశాలిస్తూ ఈ నోటీస్ లో పేర్కొన్నారు.