విలన్.. బాధితురాలిగా ఏం యాక్ట్ చేసిందిలే.. సమంత స్టైలిస్ట్ సాధన సింగ్ పోస్ట్.. ఎవరా విలన్?
సమంత స్టైలిస్ట్ సద్నా సింగ్(Sadhna Singh) సోషల్ మీడియాలో సమంత పెళ్లిపై సంచలన కామెంట్స్ చేసింది.
stylist sadhna singh sensational post on samantha second marriage
Sadhna Singh: గత కొంత కాలంగా సమంత, దర్శకుడు రాజ్ రిలేషన్ లో ఉన్నారు అంటూ వచ్చిన వార్తలు నేపధ్యంలో ఆ వార్తలను నిజం చేస్తూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు ఈ ఇద్దరు. తాజాగా సమంత-రాజ్ నిడిమోరు కోయంబత్తూర్ లోని ఈశా ఆశ్రమంలో జరిగింది. ఇక పెళ్లి అనంతరం సమంత స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఫోటోలను రిలీజ్ చేసి పెళ్లిని అధికారికంగా ప్రకటించింది. దీంతో నెటిజన్స్ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, సమంత రెండవ పెళ్లిపై నెగిటీవ్ కామెంట్స్ కూడా ఒక రేంజ్ లో వస్తున్నాయి.
ఇప్పటికే ఈ పెళ్లిపై నటి పూనమ్ కౌర్, రాజ్ నిడిమోరు మొదటి భార్య నెగిటీవ్ కామెంట్స్ చేయగా.. తాజాగా ఈ లిస్టులో సమంత స్టైలిస్ట్ సద్నా సింగ్(Sadhna Singh) చేరింది. ఆమె సైతం తన సోషల్ మీడియాలో సమంత పెళ్లిపై సంచలన కామెంట్స్ చేసింది. ‘బాధితురాలిగా.. విలన్ చాలా బాగానే నటించింది’ అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టింది. దీంతో ఆమె పెట్టిన ఈ స్టోరీ వైరల్ అయ్యింది. అలాగే, స్టోరీ పెట్టిన అనంతరం సమంతను అన్‌ఫాలో చేసింది సద్నా సింగ్. ఇప్పుడు ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సమంతను విలన్ అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నెటిజన్స్ సైతం ఈ పోస్టులు చూసి షాక్ అవుతున్నారు. అసలు సమంత బాదితురాలా.. విలనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Stylist Sadhna Singh sensational post on Samantha second marriage
