సినీ రంగానికి చాలా బ్యాడ్ టైమ్ నడుస్తుంది.. ఎంతకాలం అనేది చెప్పలేం..

రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాను రానా దగ్గుబాటి సమర్పణలో ఇటీవల ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే సినిమాను వచ్చే నెల(జూలై) 4న ‘ఆహా’లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు వెబినార్‌లో మాట్లాడుతూ.. సినిమా విషయాలతో పాటు ప్రస్తుతం ఇండస్ట్రీ భవిష్యత్ ఎలా ఉండబోతోందో కూడా తెలిపారు. ఓటీటీలో సినిమాల విడుదల విషయమై సుదీర్ఘ వివరణ ఇచ్చిన ఆయన ప్రస్తుతం సినీ రంగానికి చాలా బ్యాడ్ టైమ్ నడుస్తుందని అన్నారు.
ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు సినీ రంగానికి చాలా బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఇంకా ఎంతకాలం ఈ పరిస్థితి ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేం. ఏడాది పాటు చాలా ఇబ్బందులకు రెడీగా ఉండాలనేది నా అభిప్రాయం. కరోనా మెడిసన్, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దాని వల్ల అంతా క్యూర్ అవుతుంది అనేవరకు సినీ ఇండస్ట్రీకి సమస్య ఉంటుంది. సినీ ఇండస్ట్రీకే కాదు.. మీడియా, టూరిజం ఇలా చాలా రంగాలు సమస్యలను ఎదుర్కోవాల్సిందే..’’ అని సురేష్‌బాబు తెలిపారు.
Read:మా బ్యాంక్ మీ నగల్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటుంది..