Sudheer Babu : కొడుకు సినీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన సుధీర్ బాబు.. కృష్ణ ఫేవరెట్ వాడు కాదు..
తన కొడుకు చరిత్ మానస్ సినీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చిన సుధీర్ బాబు. కృష్ణ గారి ఫేవరెట్ వాడు కాదంటూ..

Sudheer Babu gave clarity about his son Charith Maanas movie entry
Sudheer Babu : సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన హీరో ‘సుధీర్ బాబు’. వైవిధ్యమైన కథలు, పాత్రలు చేస్తూ.. అటు మాస్ ఆడియన్స్‌ని, ఇటు క్లాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని హీరోగా కొనసాగుతున్నారు సుధీర్ బాబు. కాగా సుధీర్ బాబుకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు చరిత్ మానస్, చిన్న కొడుకు దర్శన్.
వీరిద్దరిలో చరిత్ మానస్.. మేనమామ మహేష్ బాబు పోలికలతో ఘట్టమనేని అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. మేనమామ పోలికలు, చార్మ్ ని అందుకున్న చరిత్.. తన తండ్రిలా జిమ్నాస్టిక్స్, డాన్స్ టాలెంట్స్ తో సోషల్ మీడియాలో అదరగొడుతుంటాడు. ఇక చరిత్ ని చూసిన ప్రతి ఒక్కరు.. సినిమాల్లోకి ఎప్పుడు రాబోతున్నాడు అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. సుధీర్ బాబు ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్న ఎదురవుతుంది.
Also read : Kalki 2898 AD : కల్కి సినిమా ఆలస్యానికి కారణం చెప్పిన నాగ్ అశ్విన్
తాజాగా సుధీర్ బాబు తన భార్య పిల్లలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఏడుకొండలు వెళ్లారు. తోటి భక్తులతో కలిసి సుధీర్ బాబు ఫ్యామిలీ ఆ శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా ముందుకు రాగా.. సుధీర్ బాబుకి మళ్ళీ చరిత్ సినీ ఎంట్రీ ప్రశ్న ఎదురైంది. ఇక దీనికి బదులిస్తూ.. “ఎక్కడికి వెళ్లినా చరిత్ లాంచ్ గురించే అడుగుతున్నారు. ఇంకా రెండుమూడేళ్లు సమయం ఉంది. ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు” అంటూ వెల్లడించారు. కాగా మహేష్ వారసుడు గౌతమ్ ఎంట్రీకి మరో పదేళ్లు పడుతుందని నమ్రత తెలియజేసారు. సుధీర్ బాబు మాటలు బట్టి గౌతమ్ కంటే ముందే చరిత్ ఎంట్రీ ఉండబోతుందని తెలుస్తుంది.
అలాగే తన రెండో కొడుకు దర్శన్ కూడా సినిమాలోకి వస్తాడని, వాడే కృష్ణ గారి ఫేవరెట్ అని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో తమ నెక్స్ట్ జెనరేషన్ గట్టిగానే ఉండబోతున్నట్లు పేర్కొన్నారు. అలాగే తాను నటిస్తున్న సినిమాల గురించి కూడా తెలియజేసారు. ప్రస్తుతం హరోంహర, మా నాన్న సూపర్ హీరో సినిమాల్లో నటిస్తున్నట్లు, వాటి చిత్రీకరణ చివరి దశలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఒకటి రెండు నెలల్లో ఆ సినిమాల రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేస్తాము అంటూ వెల్లడించారు.
View this post on Instagram