Maama Mascheendra Teaser: ఇంట్రెస్టింగ్‌గా సుధీర్ బాబు మామా మశ్చీంద్ర టీజర్..!

యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘మామా మశ్చీంద్ర’ టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశాడు.

Maama Mascheendra Teaser: ఇంట్రెస్టింగ్‌గా సుధీర్ బాబు మామా మశ్చీంద్ర టీజర్..!

Sudheer Babu Maama Mascheendra Teaser Impressive

Updated On : April 22, 2023 / 12:55 PM IST

Maama Mascheendra: టాలీవుడ్‌లో కంటెంట్ ఉన్న సినిమాలు చేసే హీరోగా సుధీర్ బాబు తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. సుధీర్ బాబు సినిమా వస్తుందంటే, మినిమం గ్యారెంటీ అనే మార్క్ వేసుకున్నాడు. అయితే, గతకొద్ది కాలంగా సుధీర్ బాబు చేసే సినిమాలు కంటెంట్ పరంగా బాగున్నా, కమర్షియల్ సక్సెస్ మాత్రం కావడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో ఈసారి ఎలాగైనా కమర్షియల్‌గా కూడా సక్సెస్ అందుకోవాలని ఓ ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

Sudheer Babu: పరశురామ్‌గా మరో లుక్‌ను పట్టుకొస్తున్న సుధీర్ బాబు.. ఎప్పుడంటే..?

‘మామా మశ్చీంద్రా’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తున్న సినిమాలో సుధీర్ బాబు ఏకంగా ట్రిపుల్ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు హర్షవర్ధన్ డైరెక్ట్ చేస్తుండగా, సుధీర్ బాబు ఈ సినిమాలో మూడు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్ర టీజర్‌ను తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశాడు. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. మూడు వైవిధ్యమైన గెటప్స్‌తో సుధీర్ బాబు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ ముగ్గురుకి ఎలాంటి సంబంధం ఉంటుందా.. ఈ సినిమాలో వీరి పాత్రలను ఎలా డిజైన్ చేశారా అనేది మనకు సినిమా చూస్తే అర్థమవుతుంది.

Sudheer Babu : సుధీర్ బాబు కెరీర్‌లో మొదటిసారి త్రిపాత్రాభినయం చేయబోతున్నాడా?

ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా ఈషా రెబ్బా, మిర్నాల్ని రవి నటిస్తున్నారు. సిక్స్ ప్యాక్ బాడీ ఉండే బాయ్ ఫ్రెండ్ కావాలని ఈషా కోరుకుంటున్నట్లుగా ఈ టీజర్‌లో చూపెట్టారు. మరి ఆమె కోరుకున్న బాయ్ ఫ్రెండ్ దొరికాడా.. మరో హీరోయిన్ పాత్ర ఎలా ఉంటుందనే విషయాలు ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.