Janaka Aithe Ganaka Teaser : ‘జనక అయితే గనక’ టీజ‌ర్.. పిల్ల‌లు అంటే భ‌య‌ప‌డుతున్న సుహాస్‌..

వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటూ విజ‌యాల‌ను అందుకుంటున్నాడు న‌టుడు సుహాస్‌.

Janaka Aithe Ganaka Teaser : ‘జనక అయితే గనక’ టీజ‌ర్.. పిల్ల‌లు అంటే భ‌య‌ప‌డుతున్న సుహాస్‌..

Suhas Janaka Aithe Ganaka Teaser out now

Updated On : July 4, 2024 / 5:25 PM IST

Janaka Aithe Ganaka : వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటూ విజ‌యాల‌ను అందుకుంటున్నాడు న‌టుడు సుహాస్‌. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం ‘జ‌న‌క అయితే గ‌న‌క’. సందీప్ రెడ్డి బండ్ల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో సంగీర్త‌న క‌థానాయిక‌. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు.

వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్ర‌సాద్, గోపరాజు రమ‌ణ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ‘ఆ ఒక్క డెసిషన్‌ నా లైఫ్‌ని మార్చేసింది.’ అని సుహాస్ చెప్పే డైలాగ్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మైంది. ‘నేను ఒక‌వేళ తండ్రిని అయితే నా వైఫ్‌ను సిటీలో ఉన్న బెస్ట్ ఆస్ప‌త్రిలో చూపించాలి.. నా పిల్ల‌ల‌ను బెస్ట్ స్కూల్‌లో చ‌దివించాలి.. బెస్ట్ కాలేజిలో చ‌దివించాలి.. వాళ్లకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి.. బెస్ట్ ఇవ్వ‌లేన‌ప్పుడు పిల్ల‌ల‌ను క‌న‌కూడ‌దు.’ అంటూ సుహాస్ చెప్పే డైలాగ్‌లు బాగున్నాయి.

Young Hero’s : భారీ బడ్జెట్ సినిమాలతో రిస్క్ చేస్తున్న మీడియం హీరోలు..

టీజ‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్య‌క్తి త‌న‌కు పుట్ట‌బోయే పిల్ల‌ల విష‌యంలో ఎలాంటి ప్లానింగ్ చేస్తాడు. వారి భ‌విష్య‌త్తు కోసం ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటాడు అనే క‌థాశంతో సినిమాను తెర‌కెక్కించిన‌ట్లుగా టీజ‌ర్‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.