Suhasini : షూటింగ్‌లో హీరో ఒడిలో కూర్చోమన్నారు.. ఎంగిలి ఐస్‌క్రీమ్ తినమన్నారు
నటి సుహాసిని మణిరత్నం గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆమె ప్రస్తుతం సహాయనటి పాత్రలను చేస్తున్నారు.

Suhasini Maniratnam
Suhasini : నటి సుహాసిని మణిరత్నం గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు. ఒకప్పుడు ఆమె అగ్ర హీరోలతో వరుసగా చిత్రాలను చేశారు. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆమె ప్రస్తుతం సహాయనటి పాత్రలను చేస్తున్నారు. సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ఆమె పాల్గొన్నారు. నటిగా తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితుల గురించి మాట్లాడారు. ఆ పరిస్థితులను తాను ఎలా ఫేస్ చేశాను అన్న విషయాలను వివరించారు.
గతంలో ఓ సినిమా షూటింగ్ సెట్‌లో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్న విషయాలను గుర్తు చేసుకున్నారు. ఓ సీన్‌లో భాగంగా తనను హీరో ఒడిలో కూర్చోమని చెప్పారన్నారు. అయితే.. అందుకు తాను అంగీకరించలేదని సుహాసిని చెప్పారు. ఇది భారతదేశం. ఏ స్త్రీ కూడా పరాయి పురుషుడి ఒడిలో కూర్చోదు. ఇది తప్పు. అందుకునే తాను ఆ సీన్ చేయనని చాలా గట్టిగా చెప్పినట్లు తెలిపారు.
Pooja Hegde : మాల్దీవ్స్‌లో బీచ్ పక్కన.. బికినీలో పూజా హెగ్డే బర్త్‌డే సెలబ్రేషన్స్..
‘ఇంకో సన్నివేశంలో హీరో ఐస్‌క్రీమ్ తింటూ అదే ఐస్‌క్రీమ్‌ను నాకు తినిపించాలి. అయితే అది నాకు నచ్చలేదు. వేరే వాళ్లు ఎంగిలి చేసింది నేను ఎలా తింటాను. నాకు వేరే ఐస్ క్రీం తీసుకురండి అని చెప్పాను. లేదంటే సీన్ అన్నా మార్చాలని అడిగా. అది విని మా కొరియోగ్రాఫర్ షాకయ్యారు. తాను చెప్పింది చేయాలన్నాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఐస్‌క్రీమ్‌ను ముట్టుకోనని చెప్పాను.’ అని సుహాసిని అన్నారు.
తన సహనటి, స్నేహితురాలు అయిన శోభనకు కూడా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొందన్నారు. శోభన నటించిన ఓ సినిమాలో దాదాపుగా ఇలాంటి సీన్‌నే పెట్టారు. అయితే.. ఆమెకు ఆ సీన్ నచ్చకపోవడంతో చేయనని అంది. ఇందుకు దర్శకుడు నువ్వెవరని అనుకుంటున్నావు. నువ్వు ఏమైన సుహాసిని అని అనుకుంటున్నావా..? ఇలా చెప్పడానికి అని అన్నారట. ఆ తరువాత ఈ విషయాన్ని శోభన నాకు ఫోన్ చేసి చెప్పింది అని సుహాసిని చెప్పారు.
Raviteja : తన బయోపిక్ పై రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు.. టైటిల్ ఏంటో తెలుసా? ఎవరు యాక్ట్ చేస్తారు?