Sukumar-Chiranjeevi: సుకుమార్ క్రేజీ డ్రీమ్.. చరణ్, బన్నీ తర్వాత చిరూనే?

రంగస్థలంతో రామ్ చరణ్.. పుష్పతో అల్లు అర్జున్ కు డిఫరెంట్ పాత్ సెట్ చేశారు సుకుమార్. లెక్కల మాస్టారి వింటేజ్ స్టోరీలతో చెరో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు బన్నీ, చరణ్.

Sukumar-Chiranjeevi: సుకుమార్ క్రేజీ డ్రీమ్.. చరణ్, బన్నీ తర్వాత చిరూనే?

Sukumar Chiranjeevi

Updated On : February 24, 2022 / 9:44 AM IST

Sukumar-Chiranjeevi: రంగస్థలంతో రామ్ చరణ్.. పుష్పతో అల్లు అర్జున్ కు డిఫరెంట్ పాత్ సెట్ చేశారు సుకుమార్. లెక్కల మాస్టారి వింటేజ్ స్టోరీలతో చెరో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు బన్నీ, చరణ్. అయితే ఈ మెగా హీరోల తర్వాత సుకుమార్ నెక్ట్స్ టార్గెట్.. మెగాస్టారేనా? ఇప్పటికిప్పుడు కాకపోయినా చిరూతో సుక్కూ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినట్టేనా…?

Chiranjeevi – Sukumar: చిరుతో సుక్కు సినిమా.. కల నిజమైందన్న లెక్కల మాస్టారు

మెగాస్టార్ పై లెక్కల మాస్టారు కన్నుపడింది. చరణ్, బన్నీ తర్వాత నెక్ట్స్ టార్గెట్ చిరూ అంటున్నారు సుకుమార్. ప్రస్తుతం చిరూతో ఓ కమర్షియల్ యాడ్ ప్లాన్ చేశారు సుక్కూ. ఈ యాడ్ షూట్ మీట్ కి సంబంధించి రీసెంట్ గా ఓ ఫోటో కూడా పోస్ట్ చేశారు. మెగాస్టార్ కోసం మెగాఫోన్ పట్టుకోబోతున్నా.. కల నేరవేరిందంటూ హ్యాపీనెస్ షేర్ చేసుకున్నారు ఈ క్రేజీ డైరెక్టర్. అయితే కేవలం కమర్షియల్ యాడ్ మాత్రమే కాదు.. ఫ్యూచర్ లో చిరూతో మెగా ప్రాజెక్ట్ చేసేందుకు ఐయామ్ ఇంట్రెస్టెడ్ అంటున్నారు.

Chiranjeevi: చిరు లైనప్.. సినిమాకో హీరోకి అవకాశమిస్తున్న మెగాస్టార్!

చిట్టిబాబుగా రంగస్థలంలో నటించి మరో మెట్టెక్కాడు రామ్ చరణ్. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో చూశాం. అయితే ఈ రెండు సినిమాల అసలైన బ్యాక్ బోన్ మాత్రం సుకుమార్ క్రియేటివ్ టాలెంట్. అందుకే సుక్కూతో వర్క్ చేసేందుకు చిరూ సైతం ఎదురుచూస్తున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా సినిమా ఉంటుందనే టాక్ కూడా నడుస్తోంది. ఇప్పటికైతే యాడ్ షూట్ తో ఒక్కటైన చిరూ – సుక్కూ.. త్వరలోనే మెగా ప్రాజెక్ట్ ప్రకటించినా ఆశ్చర్యం లేదు.

Chiranjeevi : మళ్ళీ కమర్షియల్ యాడ్స్‌లోకి మెగాస్టార్??

వరుసగా సినిమాలు ప్రకటిస్తూ యంగ్ హీరోలకి షాకిస్తున్నారు చిరంజీవి. ప్రస్తుతం చిరూ చేతిలో ఆచార్య, గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలతో పాటూ డైరెక్టర్ బాబీ, వెంకీ కుడుమల సినిమాలున్నాయి. అటు పుష్ప పార్ట్ 2 తర్వాత విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ తో సినిమాలు చేయాల్సిఉంది సుకుమార్. ఇలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీగా ఉన్న చిరూ, సుకుమార్ నిజంగానే ఓ ఫుల్ లెంత్ సినిమా కోసం కలిస్తే.. ఫ్యాన్స్ కి అంతకుమించిన మెగాట్రీట్ ఉండదు.