Vasishta : ‘వశిష్ఠ’ సినిమా ఓపెనింగ్.. మైథలాజికల్ సోషల్ డ్రామా కథతో..
తాజాగా నేడు వశిష్ఠ సినిమా పూజాకార్యక్రమాలు నిర్వహించారు.

Suman Tej Vasishta Movie Opening Ceremony
Vasishta : సుమన్ తేజ్, అను శ్రీ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘వశిష్ఠ’. బేబి నేహా సమర్పణలో లిటిల్ బేబీస్ క్రియేషన్స్ బ్యానర్ పై నోరి నాగప్రసాద్ నిర్మాణంలో హరీష్ చావా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా నేడు ఈ సినిమా పూజాకార్యక్రమాలు నిర్వహించారు. మైథలాజికల్ సోషల్ డ్రామా కథతో ఈ సినిమా రానుంది. నేడు పూజా కార్యక్రమంకు తెలుగు టెలివిజన్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ నాగబాల సురేష్ కుమార్, నిర్మాత లయన్ సాయివెంకట్, నటుడు గగన్ విహారి.. పలువురు గెస్టులుగా వచ్చారు.
ఈ సినిమా నిర్మాత నోరి నాగప్రసాద్ మాట్లాడుతూ.. మా వశిష్ఠ సినిమా నేడు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. పక్కా స్క్రిప్ట్ వర్క్ తో వశిష్ఠ సినిమాని నిర్మిస్తున్నాం. ప్రేక్షకులకు మంచి అనుభూతి అందించే సినిమా అవుతుంది ఇది అని అన్నారు. డైరెక్టర్ హరీశ్ చావా మాట్లాడుతూ.. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే సోషల్ డ్రామా సినిమా. కథ వినగానే సింగిల్ సిట్టింగ్ లో మా హీరో సుమన్ తేజ్ ఓకే చేశారు అని తెలిపారు.
హీరో సుమన్ తేజ్ మాట్లాడుతూ.. నేను ఇప్పటికే మూడు సినిమాల్లో నటించాను. రంగస్థలం లాంటి బ్యాక్ డ్రాప్ సినిమాలో నటించాలని ఉండేది. ఈ కథ విన్నపుడు ఆ ఫీల్ కలిగింది. వశిష్ఠ టైటిల్ లోనే ఒక పాజిటివ్ నెస్ ఉంది అని అన్నారు.