Sunny Leone : పాపం సన్నీ లియోన్‌ని ఎలా కొడుతున్నారో చూడండి..
సన్నీ లియోన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఓ గేమ్ ఆడి ఆ వీడియో పోస్ట్ చేసింది.

Sunny Leone hitting Hard by her Staff while Playing a Game in Shooting Spot
Sunny Leone : ఒకప్పుడు పోర్న్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ లియోన్ దాని నుంచి బయటకి వచ్చి బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ్ లో కూడా పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులని మెప్పిస్తుంది. మరో పక్క పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుండటంతో సన్నీ లియోన్ ని అభినందిస్తున్నారు.
సన్నీ లియోన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన ఫొటోలు, తన ఫ్యామిలీ గురించి, ఫెస్టివల్ సెలబ్రేషన్స్.. ఇలా అన్ని పోస్ట్ చేస్తూ ఉంటుంది సన్నీ లియోన్. తాజాగా ఓ గేమ్ ఆడి ఆ వీడియో పోస్ట్ చేసింది. ఈ గేమ్ లో.. తలకి హెల్మెట్ పెట్టుకొని కూర్చుంటే వెనక నిల్చున్న వాళ్ళు కొడితే ఎవరు కొట్టారో కనిపెట్టాలి. అలా కనిపెట్టే వరకు కొట్టించుకోవాల్సిందే. ఎవరు కొట్టారో కనిపెడితే ఆ తర్వాత వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని కొట్టించుకోవాలి.
అయితే ఈ గేమ్ లో అక్కడ ఆరుగురు ఉండగా కొంతమంది తమని కొట్టిన వాళ్ళని వెంటనే కనిపెట్టేసారు. అయితే అందరూ కలిసి సన్నీ లియోన్ ని ఆడుకున్నారు. ఒకేసారి ఇద్దరు, ముగ్గురు కొట్టడం, కొట్టినా తాము కాదని చెప్పడం.. ఇలా కాసేపు సన్నీ లియోన్ ని అందరూ తల మీద కొట్టి ఆడుకున్నారు. అయితే ఇది షూటింగ్ గ్యాప్ లో సరదాగా చేసిన వీడియో అని తెలుస్తుంది. ఈ గేమ్ కూడా సరదాగా ఆడుకున్నారు.
Also Read : Chiranjeevi : 68 ఏళ్ళ వయసులో జిమ్‌లో మెగాస్టార్ కసరత్తులు.. ‘విశ్వంభర’ కోసం అంటూ..
ఈ వీడియో షేర్ చేస్తూ.. సన్నీ లియోన్ నన్నెవరూ గట్టిగా కొట్టారు చెప్పండి. ఈ గేమ్ ఇంటి దగ్గర ట్రై చేయొద్దు అని పోస్ట్ చేసింది. అయితే అభిమానులు, నెటిజన్లు కూడా సరదాగా పాపం సన్నీ లియోన్ ని అందరూ కలిసి ఆడుకున్నారు, సన్నీ లియోన్ బాగా కొట్టారు అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.