Super Machi : చిరు చిన్నల్లుడి రెండో సినిమా ట్రైలర్ చూశారా..
మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న ‘సూపర్ మచ్చి’ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందకు రానుంది..

Super Machi
Super Machi: మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు ‘విజేత’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న రెండవ సినిమా.. ‘సూపర్ మచ్చి’.. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, పులి వాసుని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. రిజ్వాన్ నిర్మిస్తున్నారు.
Upcoming Movies : విడుదల వాయిదా.. వేరే దారి లేదు..
కన్నడ బ్యూటీ రచితా రామ్ కథానాయిక. సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమా ప్రేక్షకుల ముందకు రానుంది. బుధవారం ఉదయం ‘సూపర్ మచ్చి’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో చూడకుండా లవ్ చేసుకునే కాన్సెప్ట్ గురించి చూపించడంతో పాటు కథేంటనేది క్లుప్తంగా చూపించారు.
Jr NTR : ఫ్యాన్ వార్‌కి ఫుల్ స్టాప్.. వైరల్ అవుతున్న ‘సింహాద్రి’ ఓపెనింగ్ ఫొటో..
పోసాని, రాజేంద్రప్రసాద్, ప్రగతి, పృథ్వీరాజ్, విజయ్ వంటి సీనియర్ యాక్టర్స్ అందరూ ఇందులో నటించారు. ఈ సినిమాకి మ్యూజిక్ : థమన్, సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్, కో-ప్రొడ్యూసర్ : ఖుషీ.