Bharateeyans : చైనాకు వత్తాసు పలకడం ఎవరైనా సమర్థించగలరా..? మా సినిమాకు మ‌ద్ద‌తు ఇవ్వండి.. భారతీయన్స్ నిర్మాత

సెన్సార్ బోర్డు ఉన్నతాధికారులు చైనాకు భయపడి ఈ సినిమాలో మన గొంతును మూయించే ప్రయత్నం చేస్తున్నార‌ని నిర్మాత శంకర్ నాయుడు అడుసుమిల్లి ఆరోపించారు.

Bharateeyans : చైనాకు వత్తాసు పలకడం ఎవరైనా సమర్థించగలరా..? మా సినిమాకు మ‌ద్ద‌తు ఇవ్వండి.. భారతీయన్స్ నిర్మాత

Bharateeyans

Updated On : July 3, 2023 / 6:42 PM IST

Bharateeyans Producer : నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, హీరోలుగా సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భారతీయన్స్’. ప్ర‌ముఖ ర‌చ‌యిత దీన్ రాజ్ ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అతి త్వ‌ర‌లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

కాగా.. సెన్సార్ బోర్డు ఉన్నతాధికారులు చైనాకు భయపడి ఈ సినిమాలో మన గొంతును మూయించే ప్రయత్నం చేస్తున్నార‌ని నిర్మాత శంకర్ నాయుడు అడుసుమిల్లి ఆరోపించారు. మ‌న‌దేశంపై చైనా దురాగ‌తాల‌ను వెల్ల‌డిస్తూ రూపుదిద్దుకున్న మొద‌టి సినిమా అని చెప్పారు. చైనా దాడులు, బ్యాక్‌స్టాబ్‌లు వంటివి కొన్ని మీకు తెలిసి ఉండొచ్చు.. ఇంకా తెలియ‌ని అనేక విష‌యాల‌ను ఈ సినిమాలో చూపించిన‌ట్లు తెలిపారు.

Dulquer Salmaan : క‌న్నీరు పెట్టుకున్న సీతారామం హీరో.. ఆదివారం రాత్రి వీడియో పోస్ట్‌.. ఆ వెంట‌నే డిలీట్‌.. ఆందోళ‌న‌లో అభిమానులు

1950ల నుండి చైనా అనేక ప్రత్యక్ష, పరోక్ష యుద్ధాలతో భారతదేశాన్ని దెబ్బ‌తీస్తోంద‌న్నారు. వ్యూహాత్మకంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి టిబెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని క్లెయిమ్ చేస్తూ, మనపై దాడి చేయడానికి రోడ్లు,ఇతర మౌలిక సదుపాయాలను నిర్మించారు. సరిహద్దులో మ్యాప్‌లను మారుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో పేర్లను మారుస్తోంది. 2020లో గాల్వాన్ లోయ‌లో 20 మంది భారతీయ సైనికులను హతమార్చింది.

అంతేకాకుండా కోవిడ్‌ని తయారు చేసింది. ఇది వుహాన్ ల్యాబ్ నుండి వచ్చింది. దాదాపు 8 మిలియన్ల మందిని చ‌నిపోయారు. కొద్ది వారాల క్రితం కాశ్మీర్‌లో జరిగిన జి 20 శిఖరాగ్ర సమావేశాన్ని చైనా బహిరంగంగా బహిష్కరించింది. కాశ్మీర్ వివాదాస్పద భూభాగమని, పాకిస్తాన్‌కు బహిరంగంగా మద్దతునిస్తోంది. మన సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడానికి ఎంత ధైర్యం? పాకిస్తాన్, కాశ్మీర్ ఉగ్రవాదులకు చైనా బహిరంగంగా మద్దతు ఇస్తుంది. ఇప్పుడు కొన్ని రోజుల క్రితం మనపై 26/11 దాడికి సూత్రధారి అయిన లస్కరే తోయిబా తీవ్రవాది సయ్యద్ మీర్‌ను ఒక క్రూరమైన తీవ్రవాదిగా ప్రకటించాలనే భారతదేశం – అమెరికా సంయుక్త తీర్మానాన్ని అడ్డుకుంది.

Bandla Ganesh : ప‌వ‌ర్‌స్టార్‌కు బండ్ల గ‌ణేష్ ప్రామిస్‌.. సాయంగా ఉంటా.. లేదంటే దూరంగా ఉంటా.. అంతేగాని ప‌వ‌న్ పేరు చెప్పుకుని..

చైనా ఎల్లప్పుడూ మన వెనుక కత్తితో దాడి చేసే శత్రువు. అత్యంత ప్రమాదకరమైన, మోసపూరిత, దుర్మార్గమైన చైనా.. కొన్ని శతాబ్దాల క్రితం బ్రిటీష్ లాగా సాధ్యమైన ప్రతి దేశాన్ని వలసరాజ్యం చేయడానికి ప్రయత్నిస్తూ అధికారంలో ఉండటానికి దాని స్వంత ప్రజలను సైతం చంపుతుంది. ఈ దుర్మార్గపు, నిరంకుశుల గురించి “భారతీయన్స్” చిత్రంలో ఎండ‌గ‌ట్టాము. అయితే దురదృష్టవశాత్తు సెన్సార్ బోర్డు నన్ను సినిమాలో చైనా పేరును ఉపయోగించవద్దని, అంతేకాకుండా గాల్వాన్ వ్యాలీ పేరును తొల‌గించాల‌ని సూచించింద‌ని శంకర్ నాయుడు అడుసుమిల్లి చెప్పారు.

ఇది ఎంత అరాచకం? ఎంత అవమానకరం? గాల్వాన్ వ్యాలీని చైనాకు అప్పగిస్తున్నామా? మనం చైనాకు లొంగిపోతున్నామా? అని ప్ర‌శ్నించారు. మనం మౌనంగా ఉండలేము, బలహీనంగా ఉండలేము. మన జాతీయ చిహ్నమైన 4 సింహాల యొక్క ధైర్యం, పోరాట స్ఫూర్తిని మనం కలిగి ఉండాలి. సింహంలా ఉండండి, “భారతీయన్స్” చిత్రానికి మద్దతు ఇవ్వండి అని శంకర్ నాయుడు అడుసుమిల్లి కోరారు.

Bharateeyans : దేశభక్తి సినిమా ‘భారతీయన్స్’ టీజర్ లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ డి.సురేష్ బాబు