Amar Deep – Supritha : సురేఖ వాణి కూతురు హీరోయిన్‌గా.. బిగ్‌బాస్ అమర్‌దీప్ సినిమా..
సురేఖ వాణి కూతురు హీరోయిన్‌గా బిగ్‌బాస్ అమర్‌దీప్ హీరోగా సినిమా మొదలు.

Surekhavani daughter Suprith as heroine in BiggBoss Amar Deep movie
Amar Deep – Supritha : బుల్లితెర నటుడు అమర్ దీప్.. తెలుగులో పలు సీరియల్స్ లో నటించి ఆడియన్స్ లో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. ఇక ఇటీవల బిగ్‌బాస్ సీజన్ 7కి కంటెస్టెంట్ గా వెళ్లి గట్టి పోటీ ఇచ్చి.. రన్నరప్ గా బయటకి వచ్చారు. బిగ్‌బాస్ హౌస్ లో తన ఆటతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న అమర్ దీప్.. ఇప్పుడు హీరోగా వెండితెర పై కనిపించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ కొత్త సినిమా ఓపెనింగ్ నేడు హైదరాబాద్ లో జరిగింది. M3 మీడియా బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత కనిపించబోతుంది. సురేఖ వాణితో కలిసి సుప్రిత కూడా సినిమా ఈవెంట్స్ కి హాజరుకావడం, సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో సందడి చేస్తుండడంతో.. గత కొంతకాలంగా సుప్రిత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.
Also read : Keerthy Suresh : బాలీవుడ్ సినిమాకి కీర్తి సురేష్ డేట్స్ ఇవ్వట్లేదా.. హీరో అంత మాట అనేశాడేంటి?
View this post on Instagram
View this post on Instagram
ఇప్పుడు ఆ వార్తలన్నీ నిజమవబోతున్నాయి. అమర్ దీప్ సరసన హీరోయిన్ గా నటిస్తూ సుప్రిత వెండితెర అరగేంట్రం చేయబోతున్నారు. నేడు ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో గ్రాండ్ గా జరిగింది. మరి బిగ్‌బాస్‌తో అమర్ దీప్, ఇన్‌స్టాగ్రామ్ ఫోటోషూట్స్ తో సుప్రిత.. మంచి ఫాలోయింగ్‌నే సంపాదించుకున్నారు. ఈ సినిమాతో ఆ ఫాలోయింగ్ ని మరింత పెంచుకుంటారో లేదో చూడాలి.
కాగా అమర్‌దీప్ గతంలోనే ఓ సినిమాలో నటించారు. అయితే అది పెద్దగా గుర్తింపుని తీసుకు రాలేదు. కానీ సీరియల్స్ తో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఇటీవల తన అభిమాన హీరో రవితేజ సినిమాలో కూడా ఛాన్స్ అందుకున్నారు. బిగ్‌బాస్ షోలో ఉన్న సమయంలో రవితేజ ఒక ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చినప్పుడు.. తన సినిమాలో అవకాశం ఇస్తానని అమర్ దీప్ కి మాటిచ్చారు. మరి రవితేజ సినిమాల్లో అమర్ దీప్ ఎప్పుడు కనిపిస్తాడో చూడాలి.