Suriya – Jyotika : సూర్య – జ్యోతిక కోటి విరాళం

సూర్య - జ్యోతిక దంపతులు తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసి కోటి రూపాయాల చెక్కునందజేశారు..

Suriya – Jyotika : సూర్య – జ్యోతిక కోటి విరాళం

Suriya Jyotika

Updated On : November 2, 2021 / 5:30 PM IST

Suriya – Jyotika: వెర్సటైల్ యాక్టర్ సూర్య వరుస సినిమాలతో స్పీడ్ మీదున్నారు. పాండమిక్ కారణంగా థియేటర్లు మూతపడడంతో తన సినిమాలను ఓటీటీలో విడుదల చేసి డేర్ స్టెప్ తీసుకోవడంతో పాటు విజయాలు సాధించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు.

Jr Soundarya : సౌందర్య మళ్లీ పుట్టిందా?జూనియర్ సౌందర్యను చూశారా!

‘ఆకాశం నీ హద్దురా’ తో గతేడాది చివర్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సూర్య ఇప్పుడు ‘జైభీమ్’ తో అంతకుమించి సంచలనం సృష్టిస్తున్నారు. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమా విడుదలైంది. అన్ని చోట్ల నుండి అదిరిపోయే టాక్ వస్తుంది. ముఖ్యంగా సూర్య పర్ఫార్మెన్స్, కాన్సెప్ట్ అద్భుతం అంటున్నారు.

Aha 2.0 : టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ‘ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0’

జ్యోతిక కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన 50వ సినిమా తెలుగు, తమిళ్‌లో అమెజాన్ ద్వారా రిలీజ్ అయ్యింది. తెలుగులో ‘రక్తసంబంధం’ పేరుతో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది.

Pragathi : క్యాట్‌వా‌క్‌తో కవ్విస్తున్న ప్రగతి

రీసెంట్‌గా విద్యార్థుల చదువు కోసం కోటి రూపాయల విరాళమందించారు సూర్య – జ్యోతిక దంపతులు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసి కోటి రూపాయల చెక్కు అందజేశారు. గిరిజనులకు విద్య కోసం సూర్య దంపతులు విరాళమివ్వడం అభినందనీయం.. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని, తన వంతు సాయం కూడా వారికందిస్తానని హామీ ఇచ్చారు స్టాలిన్.