Suriya : హీరో సూర్య పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తెలుసా?

ఇటీవల సూర్య ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

Suriya : హీరో సూర్య పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తెలుసా?

Suriya childrens studying in another city he gives clarity on rumours

Suriya Childrens : తమిళ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య అన్ని సినిమాలు డబ్బింగ్ లో ఇక్కడ కూడా రిలీజవుతాయి. సూర్య ప్రమోషన్స్ కి ప్రతి సినిమాకి తెలుగు రాష్ట్రాలకి వస్తాడు. ఇటీవల సూర్య బర్త్ డేకి తెలుగు స్టేట్స్ లో భారీ ఎత్తున ర్యాలీలు, సెలబ్రేషన్స్ చేశారు. ప్రస్తుతం సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

సూర్య ప్రస్తుతం కంగువా సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత మరో నాలుగు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇటీవలే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కూడా రెండు సినిమాలు ఉన్నాయని చెప్పి ప్రేక్షకుల్లో, అభిమానుల్లో తన రాబోయే సినిమాలపై మరింత ఆసక్తి పెంచారు. ఇటీవల సూర్య ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

Mukku Avinash : ముక్కు అవినాష్‌ భార్య సీమంతం వీడియో చూశారా.. మెహందీ కాన్సెప్ట్ అదుర్స్..

అయితే గత కొంతకాలంగా సూర్య చెన్నైలో ఉండట్లేదని, ముంబైలో ఉంటున్నాడని తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై అభిమానులు సూర్యని అడగ్గా.. నేను ఇక్కడే ఉంటున్నాను. నా పిల్లలు ఇద్దరూ ముంబైలో చదువుతున్నారు. వాళ్లిద్దరు మాత్రమే అక్కడ ఉంటున్నారు. నేను అప్పుడప్పుడు ముంబై వెళ్లి వస్తున్నాను వాళ్ళ కోసం. అంతే కానీ నేను చెన్నైని వదిలి ఎక్కడికి పోలేదు అని తెలిపారు. సూర్య, జ్యోతికలకు ఇద్దరు పిల్లలు అని తెలిసిందే. అమ్మాయి దియా, అబ్బాయి దేవ్. అమ్మాయి రెండేళ్ల క్రితం కరోనా సమయంలో టెన్త్ క్లాస్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాళ్లిద్దరూ ముంబైలో చదువుతున్నారని సూర్య స్వయంగా తెలిపారు. మరి వాళ్ళు ఏ కోర్సులు చదువుతున్నారో చెప్పలేదు.