Suriya : దుల్కర్ సల్మాన్‌తో మూవీ అనౌన్స్ చేసిన సూర్య.. మల్టీస్టారర్ చిత్రమా..?

గత కొంత కాలంగా సూర్య, దుల్కర్ సల్మాన్ కలయికలో ఒక సినిమా రాబోతుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ వార్తలని సూర్య నిజం చేస్తూ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.

Suriya : దుల్కర్ సల్మాన్‌తో మూవీ అనౌన్స్ చేసిన సూర్య.. మల్టీస్టారర్ చిత్రమా..?

suriya dulquer salmaan movie with director sudha kongara

Suriya : కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం ‘కంగువ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరో పక్క తన సూపర్ హిట్ మూవీ ‘ఆకాశమే హద్దురా’ చిత్రాన్ని నిర్మాతగా హిందీలో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఒరిజినల్ సినిమాని డైరెక్ట్ చేసిన సుధా కొంగరనే రీమేక్ ని కూడా తెరకెక్కిస్తోంది. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సూర్య కూడా గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే, సూర్య తన కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. గత కొంత కాలంగా సూర్య, దుల్కర్ సల్మాన్ కలయికలో ఒక సినిమా రాబోతుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆ వార్తలని సూర్య నిజం చేస్తూ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఆకాశమే హద్దురా సినిమాతో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనిపించుకున్న సుధా కొంగర, మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ తో తన నెక్స్ట్ సినిమాని సూర్య అనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్‌, విజయ్ వర్మ, నజ్రియా నజీమ్ ముఖ్య పత్రాలు చేస్తున్నారని ఒక వీడియో ద్వారా తెలియజేశాడు. మరి ఇది మల్టీస్టారర్ గా తెరకెక్కుతుందా..? అనేది తెలియాల్సి ఉంది. ఇక పోస్టు చేసిన వీడియో చూస్తుంటే.. పిరియాడికల్ పొలిటికల్ యాక్షన్ డ్రామా కథాంశం అని అర్ధమవుతుంది.

Also read : RT4GM : రవితేజ, గోపీచంద్ మూవీ లాంచ్.. విలన్‌గా హీరో ధనుష్ బ్రదర్..!

ఇక ఈ సినిమా టైటిల్ కూడా ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తుంది. అయితే వీడియోలో మాత్రం సగం టైటిల్ ని మాత్రమే చూపించారు. కాగా ఈ చిత్రాన్ని సూర్య తన సొంత బ్యానర్ 2D ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మించబోతున్నాడు. జివి ప్రకాష్ కి ఇది 100వ సినిమా కావడం విశేషం. మూవీ అనౌన్స్‌మెంట్ తోనే అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మరి ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో, ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తుందో అనేది తెలియాల్సి ఉంది.