Suriya : బాలీవుడ్ దర్శకుడితో సూర్య 600 కోట్ల భారీ బడ్జెట్ మూవీ.. టైటిల్ ‘కర్ణ’.. కర్ణుడి కథేనా..?
దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో సూర్య కర్ణ మూవీ. ఈ మూవీలో టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్, బాలీవుడ్‌లోని..
Suriya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుసపెట్టి క్రేజీ ప్రాజెక్ట్స్ ని సెట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో కంగువ (Kanguva) అనే పిరియాడికల్ డ్రామా మూవీని సిద్ధం చేస్తున్నాడు. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా ఇది తెరకెక్కుతుంది. ఈ మూవీ తరువాత కూడా సూర్య అదే రేంజ్ లో మరో మూవీ చేయబోతున్నాడని తెలుస్తుంది. బాలీవుడ్ డైరెక్టర్ రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా డైరెక్షన్‌లో సూర్య ఒక సినిమా చేయబోతున్నాడట.
దర్శకుడు రాకేశ్ ఓం ‘కర్ణ’ అనే ఒక బడా ప్రాజెక్ట్ తెరకెక్కించబోతున్నట్లు, అలాగే మూవీలో హీరోగా సూర్య నటించబోతున్నట్లు బాలీవుడ్ లో కొంతకాలం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం గురించి ఈ దర్శకుడిని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. “నేను ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్స్ పై వర్క్ చేస్తున్నాను. వాటిలో కర్ణ కూడా ఒకటి” అంటూ బదులిచ్చాడు. ఈ మాటలతో దర్శకుడు రాకేశ్ ఓం సూర్యతో ప్రాజెక్ట్ ని ఇన్‌డైరెక్ట్ గానే కన్‌ఫార్మ్ చేసేశాడు.
Chandramukhi 2 : చంద్రముఖిగా కంగనా లుక్ చూశారా.. బయపడాల్సింది పోయి మెస్మరైజ్ అవుతారు..
ఇక ఈ సినిమాని దాదాపు 600 కోట్లతో తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఇండియన్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన లేదా చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాల్లో.. ఇదే అత్యంత హై బడ్జెట్ మూవీ. కాగా ఈ మూవీ మహాభారతంలోని కర్ణుడి పాత్ర ఆధారంగా తెరకెక్కబోతుందని తెలుస్తుంది. ఈ చిత్రంలో సూర్యతో పాటు టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్, బాలీవుడ్ లోని బిగ్ స్టార్స్ కూడా కనిపించబోతున్నారని సమాచారం. అయితే ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుంది అనేదాని పై ఇంకా క్లారిటీ లేదు. ఏదేమైనా సూర్య ఇలా వరుసపెట్టి పిరియాడికల్ యాక్షన్ డ్రామా సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్ లో సందడి చేయడానికి వస్తుండడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు.