Lopaliki Ra Chepta : ‘లోపలికి రా చెప్తా’ ట్రైలర్ రిలీజ్.. రొమాంటిక్ హారర్..
మీరు కూడా లోపలికి రా చెప్తా ట్రైలర్ చూసేయండి..

Susmitha Anala Lopaliki Ra Chepta Movie Trailer Released by vijayendra prasad
Lopaliki Ra Chepta : మాస్ బంక్ మూవీస్ బ్యానర్ పై లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర నిర్మాణంలో కొండా వెంకట రాజేంద్ర మెయిన్ లీడ్ లో నటిస్తూ తెరకెక్కిస్తున్న సినిమా లోపలికి రా చెప్తా. మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 5న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్ కు రచయిత విజయేంద్రప్రసాద్, నటుడు శుభలేఖ సుధాకర్ గెస్టులుగా హాజరయ్యారు.
మీరు కూడా లోపలికి రా చెప్తా ట్రైలర్ చూసేయండి..
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. లోపలికి రా చెప్తా ట్రైలర్ చూశాక మీలో భయం కలిగే ఉంటుంది. లోపలికి రా చెప్తా సినిమా ప్రేక్షకుల్ని భయపెట్టడమే కాదు, వారి దగ్గర నుంచి మంచి కలెక్షన్స్ కూడా రాబట్టాలని కోరుకుంటున్నా అన్నారు. నటుడు శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ.. రాజేంద్ర నాకు బాగా పరిచయం. కొత్త ఆలోచనలతో సినిమాలు తీస్తాడు. గతంలో ఆయన చేసిన ఓ సినిమాలో నటించాను. లోపలికి చెప్తే రా అనే టైటిల్ తోనే లోపలికి వస్తే ఏం చేస్తారో అనే క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు అని అన్నారు.
హీరో, డైరెక్టర్ కొండా వెంకట రాజేంద్ర మాట్లాడుతూ.. విజయేంద్రప్రసాద్ గారి శిష్యుడు అనే గుర్తింపు వల్లే నేను ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్ సినిమాలకు పనిచేయగలిగాను. స్క్రీన్ ప్లేలో నాకు ఉన్న పదేళ్ల అనుభవంతో లోపలికి రా చెప్తా సినిమాని తీసాను. నాలుగైదు జానర్స్ కలిపి ఈ మూవీకి స్క్రిప్ట్ చేశాను. ఈ సినిమా వెనక రెండేళ్ల హార్డ్ వర్క్ ఉంది. హారర్, కామెడీతో రొమాంటిక్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. జూలై 5న లోపలికి రా చెప్తా సినిమా రిలీజ్ చేస్తున్నాము అని తెలిపారు.