Anaganaga Australia Lo : అనగనగా ఆస్ట్రేలియాలో మూవీ రివ్యూ..
అనగనగా ఆస్ట్రేలియాలో సినిమా ఓ స్కామ్ లో ఇరుక్కొని హీరో, హీరోయిన్ ఎలా బయటకు వచ్చారు అని సాగే సస్పెన్స్ థ్రిల్లర్.

Anaganaga Australia Lo Movie Review
Anaganaga Australia Lo Movie Review : జ్యోతినాథ్ గౌడ్, సాన్య భట్నాగర్, జెడిఆర్ చెరుకూరి, చంద్ర కొమ్మాలపాటి.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా అనగనగా ఆస్ట్రేలియాలో. సహాన ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై బీటీఆర్ శ్రీనివాస్ నిర్మాణంలో తారక రామ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న మార్చి 21న థియేటర్స్ లో రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే.. హీరో(జ్యోతినాథ్ గౌడ్) ఆస్ట్రేలియాలో ఒక క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. హీరోయిన్(సాన్య భట్నాగర్) ఆస్ట్రేలియాలో చదువుకుంటూ తన చదువు కోసం చిన్న చిన్న అసైన్‌మెంట్స్ రాసి డబ్బులు సంపాదిస్తుంది. ఒక రాజకీయ నేత తన కొడుకుని పాలిటిక్స్‌లోకి తీసుకురావాలని చూస్తున్న సమయంలో ఒక రహస్యం నా దగ్గర ఉందని ఆస్ట్రేలియా నుంచి ఒకరు భయపెడతారు. అది బయటకు వస్తే రాజకీయ జీవితం ఉండదు అని ఆ రహస్యాన్ని వెతికి తెచ్చేందుకు ఒక క్రిమినల్‌ని హైర్ చేస్తారు.
ఓ రోజు హీరోయిన్ తన అసైన్‌మెంట్ డబ్బులు తీసుకోవడానికి ఓ వ్యక్తి రూమ్‌కి వెళ్తుంది. అనుకోకుండా ఆ క్రిమినల్ రూమ్‌లోకి వెళ్లడంతో అక్కడ కొన్ని వస్తువులను దొంగిలిస్తుంది. ఆ వస్తువుల్లో ఆ సీక్రెట్ కూడా ఉంటుంది. అలాగే ఆమెకు దొంగ డబ్బు గురించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దీంతో ఆ కిల్లర్, రాజకీయ నాయకుల మనుషులు, ఇంకొంతమంది ఆ అమ్మాయి వెనక పడతారు. అనుకోకుండా ఆమె ఓ స్కామ్ కేసులో ఇరుక్కుంటుంది. మరి వీటన్నిటి నుంచి హీరోయిన్ ఎలా బయటకు వచ్చింది? హీరో – హీరోయిన్ ప్రేమ కథ ఏమైంది? ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటి? ఆ డబ్బు, స్కామ్ ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. సినిమా అంతా ఆస్ట్రేలియాలోని షూట్ చేసారు. అక్కడ ఉన్నవాళ్లతోనే తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ కథతో మొదలుపెట్టి ప్రేమకథతో నడుస్తుంది. ఓ స్కామ్ లో హీరోయిన్ ఎలా చిక్కుకుంది అని సస్పెన్స్ తో సాగుతుంది. సెకండ్ హాఫ్ ఆ సీక్రెట్ ఏంటి? డబ్బు ఏంటి? ఆ స్కామ్ ఏంటి? అందులో హీరో, హీరోయిన్ ఎలా ఇరుక్కున్నారు, ఎలా బయటకు వచ్చారు అని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ లు బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ లా నడిపించాడు. అక్కడక్కడా కాస్త కామెడీ వర్కౌట్ చేసారు. అక్కడక్కడా రొమాన్స్ కూడా ఎక్కువే.
నటీనటుల పర్ఫార్మెన్స్.. ఈ సినిమాలో ఆల్మోస్ట్ అందరూ కొత్తవాళ్లే నటించారు. హీరోయిన్ సాన్య భట్నాగర్ తన క్యూట్ నెస్ తో పాటు థ్రిల్లింగ్ యాక్టింగ్ తో మెప్పిస్తుంది. జ్యోతినాథ్ గౌడ్ హీరో పాత్రలో బాగానే మెప్పించాడు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : Chiranjeevi : పీఎం మోదీ ఆ రోజు నాతో ఏం మాట్లాడారంటే.. కన్నీళ్లు వచ్చాయంటూ.. చిరు వ్యాఖ్యలు వైరల్..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగా ఇచ్చారు. పాటలు యావరేజ్. ఆస్ట్రేలియా లొకేషన్స్ అన్ని బాగున్నాయి. పాత కథే అయినా ఆస్ట్రేలియాలో జరిగినట్టు చూపించడం, స్క్రీన్ ప్లే కొత్తగా ప్రయత్నించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా బాగానే ఖర్చుపెట్టినట్టు సినిమాలో కనిపిస్తుంది.
మొత్తంగా అనగనగా ఆస్ట్రేలియాలో సినిమా ఓ స్కామ్ లో ఇరుక్కొని హీరో, హీరోయిన్ ఎలా బయటకు వచ్చారు అని సాగే సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.