SV Krishna Reddy : అలనాటి హీరోయిన్స్ తో ఎస్వీ కృష్ణారెడ్డి.. తన దర్శకత్వంలో నటించిన వారితో గ్రాండ్ గా పుట్టినరోజు వేడుకలు..
నిన్న ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్ని హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.

SV Krishna Reddy Birthday Celebrations with Heros and Heroins
SV Krishna Reddy : ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచారు ఎస్వీ కృష్ణారెడ్డి. జగపతి బాబు, శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, జెడి చక్రవర్తి.. లాంటి పలువురికి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు. 32 ఏళ్ల కెరీర్ లో 42 సినిమాలు తీయగా వాటిలో 90 శాతం హిట్ సినిమాలు అందించారు. నిన్న ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్ని హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో ఆయనతో సినిమాలు చేసిన నటీనటులు చాలా మంది హాజరయ్యారు.
శ్రీకాంత్, ఆమని, ఇంద్రజ, లయ, అలీ, శివాజీ రాజా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, చంద్రబోస్, రవళి, రాజేంద్రప్రసాద్, రోజా, మురళీమోహన్, బండ్ల గణేష్.. ఇలా అనేకమంది సెలబ్రిటీలు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకలను ఎస్వీ కృష్ణారెడ్డి ప్రాణ మిత్రుడు, ఆయన సినిమాల నిర్మాత అచ్చిరెడ్డి నిర్వహించారు.
Also Read : Pawan Kalyan : తన సినిమా అయినా రూల్ రూలే.. ‘హరిహర వీరమల్లు’తోనే కొత్త రూల్ మొదలు..
ఈ ఈవెంట్ కి వచ్చిన అలనాటి హీరోయిన్స్, హీరోలు, కమెడియన్స్ అందరూ ఎస్వీ కృష్ణారెడ్డితో తమకున్న అనుబంధం, ఆయనతో చేసిన సినిమాల గురించి మాట్లాడారు. హీరోయిన్స్, హీరోలు ఆయనతో స్పెషల్ గా ఫొటోలు దిగారు.
ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. కేవీ రెడ్డి గారిని ఎస్వీ కృష్ణారెడ్డి స్ఫూర్తిగా తీసుకున్నాడు. దాసరి గారికి ఏకలవ్య శిష్యుడిని అని ఎస్వీ చెప్పుకునేవారు. ఎస్వీ కృష్ణారెడ్డిని నువ్వు డైరెక్టర్ అవుతావు అని ఎంకరేజ్ చేశా. మా కాంబినేషన్ లో గొప్ప సినిమాలు వచ్చాయి. మా సినిమాల్లో చేసిన వాళ్లంతా దాదాపు 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతుండటం గర్వంగా ఉంది. ఇవాళ వాళ్లంతా మా ఎస్వీ బర్త్ డే వేడుకలకు రావడం సంతోషంగా ఉంది అని తెలిపారు.
Also Read : Ghaati : అనుష్క ‘ఘాటీ’ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..
డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నేను ఈ ప్రతిభావంతులకు అవకాశాలు ఇచ్చానని చెబుతున్నారు కానీ వాళ్లు స్వతహాగా మంచి టాలెంట్ ఉన్నవారు. నా సినిమాల ద్వారా వారి ప్రతిభ ప్రేక్షకులకు మరింతగా తెలిసింది. నన్ను మొదటి నుంచి ప్రోత్సహిస్తూ, నా వెంటే అండగా నిలబడిన అచ్చిరెడ్డి గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను. హీరోగా నటించి నా మొదటి మూవీకి అవకాశం ఇచ్చిన రాజేంద్రప్రసాద్ గారికి ధన్యవాదాలు అని తెలిపారు.