Swara Bhaskar : డబ్బులిచ్చి మరీ బాలీవుడ్ ని బాయ్‌కాట్‌ చేయిస్తున్నారు.. బాలీవుడ్ ని నాశనం చేయాలని చూస్తున్నారు..

తాజాగా బాలీవుడ్ నటి స్వరభాస్కర్ ఈ బాయ్‌కాట్‌ బాలీవుడ్ పై సీరియస్ గా స్పందించింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్వర భాస్కర్ మాట్లాడుతూ.. ''ఈ బాయ్‌కాట్‌ బాలీవుడ్ ని కొంతమంది కావాలని చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా.................

Swara Bhaskar : డబ్బులిచ్చి మరీ బాలీవుడ్ ని బాయ్‌కాట్‌ చేయిస్తున్నారు.. బాలీవుడ్ ని నాశనం చేయాలని చూస్తున్నారు..

Swara Bhaskar Sensational comments on Boycott Bollywood

Updated On : September 4, 2022 / 7:53 AM IST

Swara Bhaskar :  ఇటీవల వరుసగా బాలీవుడ్ సినిమాలు ఫ్లాప్ అవుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు కూడా ఫ్లాప్స్ బాట పట్టారు. దీనికి తోడు బాయ్‌కాట్‌ బాలీవుడ్ ట్రెండ్ తో బాలీవుడ్ కి మరింత ఎదురుదెబ్బ తగులుతుంది. ఏ సినిమా వచ్చినా కొంతమంది నెటిజన్లు ఏదో ఒక కారణం చెప్పి బాయ్‌కాట్‌ బాలీవుడ్ అంటున్నారు. ఆ సినిమాలని, అందులో నటీనటుల్ని బాయ్‌కాట్‌ అంటున్నారు. ఇన్ని రోజులు ఈ వివాదంపై సైలెంట్ గా ఉన్న బాలీవుడ్ నటులు ఇప్పుడిప్పుడే దీనిపై నోరు విప్పుతున్నారు. కొంతమంది ఆర్టిస్టులు ఈ బాయ్‌కాట్‌ బాలీవుడ్ పై విమర్శలు విసురుతూ సీరియస్ అవుతున్నారు.

 

తాజాగా బాలీవుడ్ నటి స్వరభాస్కర్ ఈ బాయ్‌కాట్‌ బాలీవుడ్ పై సీరియస్ గా స్పందించింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్వర భాస్కర్ మాట్లాడుతూ.. ”ఈ బాయ్‌కాట్‌ బాలీవుడ్ ని కొంతమంది కావాలని చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ గ్యాంగ్ తయారయింది. డబ్బులిచ్చి మరీ ట్వీట్స్, ట్రోల్స్ చేయిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి దాంతో ఈ ట్వీట్స్ చేస్తున్నారు. ఇదంతా చేయిస్తున్నదే కానీ ప్రజలు వాళ్ళంతట వాళ్ళు మాత్రం చేయట్లేదు అని తెలుస్తుంది.”

#Boycott VikramVeda : నీ పని నువ్వు చూసుకో.. నీ సినిమా కూడా బాయ్ కాట్ చేస్తాం.. హృతిక్ కి నెటిజన్లు వార్నింగ్..

”ఈ బాయ్‌కాట్‌ బాలీవుడ్ సినిమా వసూళ్ల మీద ఎంత ప్రభావం చూపిస్తుందో మాత్రం తెలీదు. సినిమాలు ఆడకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. బాయ్‌కాట్‌ బాలీవుడ్ ఒక్కటే కారణం కాదు. అయినా అందరూ ఫ్లాప్ అయిన సినిమాల గురించే మాట్లాడతారు. ఇదే సమయంలో గంగుబాయ్‌ కతియావాడి, భూల్‌ భూలయ్య-2 సినిమాలు హిట్‌ అయ్యాయి. వాటి గురించి ఎవరూ మాట్లాడట్లేదు ఎందుకు” అని సీరియస్ గా ప్రశ్నించింది. మరి బాయ్‌కాట్‌ పై స్వర భాస్కర్ చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు ఈమెని కూడా బాయ్‌కాట్‌ చేస్తారేమో చూడాలి. త్వరలో భారీ సినిమా బ్రహ్మాస్త్ర రిలీజ్ కానుంది. ఈ సినిమాతో అయినా బాలీవుడ్ ఫేట్ మారుతుందేమో అని బాలీవుడ్ వర్గాలు ఆశిస్తున్నారు.