Syamala Devi : బుజ్జి వెహిక‌ల్‌లో ప్ర‌భాస్ పెద్ద‌మ్మ‌.. క‌ల్కి సినిమా చూసి ఏమందంటే..?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మూవీ కల్కి 2898AD.

Syamala Devi : బుజ్జి వెహిక‌ల్‌లో ప్ర‌భాస్ పెద్ద‌మ్మ‌.. క‌ల్కి సినిమా చూసి ఏమందంటే..?

Syamala Devi review on Kalki 2898 AD

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మూవీ కల్కి 2898AD. భారీ బ‌డ్డెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ నేడు (జూన్ 27 గురువారం) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అదిరిపోయే యాక్షన్ సీన్స్, మహాభారతం విజువల్స్, ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. విడుద‌లైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాను ప్ర‌భాస్ పెద్ద‌మ్మ, స్వర్గీయ కృష్ణంరాజు సతీమణి శ్యామ‌ల దేవీ హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ఐమాక్స్‌లో వీక్షించారు.

అనంత‌రం ఐమాక్స్ ప‌రిస‌రాల్లో ఉంచిన బుజ్జి వెహిక‌ల్‌లో ఆమె కూర్చుకున్నారు. ఫోటోలు దిగారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు ఇది పెద్ద పండుగ‌.. 1000 పెద్ద పండుగ‌ల‌ను క‌లిపితే క‌ల్కి పండ‌గ అని అన్నారు.

Rajamouli – Prabhas : రాజమౌళి చెప్పినట్టే ప్రభాస్ చేశాడు.. కల్కిలో ప్రభాస్ పాత్ర రాజమోళి ఎప్పుడో చెప్పాడు..

ఇక‌ సినిమాను విజ‌య‌వంతం చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు, రెబ‌ల్ స్టార్ ఫ్యాన్స్‌కు హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. చిత్రంలోని విజువ‌ల్స్ చాలా బాగున్నాయ‌ని అన్నారు. ప్ర‌భాస్‌ను చూస్తే క‌న్నుల పండుగ‌గా ఉంద‌న్నారు.

వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అన్నా బెన్, మాళవిక నాయర్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్ లు కీల‌క పాత్ర‌లు పోషించారు.

Kalki 2898 AD : నార్త్ అమెరికాలో ‘కల్కి’ జోరు.. ఆర్ఆర్ఆర్ రికార్డు బేజారు