బెంగుళూరులో సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్

సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం.. బెంగుళూరులోని నాగావరా, మాన్యతా టెక్ పార్క్ రోడ్‌లోని మాన్ఫో కన్వెన్షన్ సెంటర్ నందు సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగనుంది..

  • Published By: sekhar ,Published On : September 28, 2019 / 07:19 AM IST
బెంగుళూరులో సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్

Updated On : September 28, 2019 / 7:19 AM IST

సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం.. బెంగుళూరులోని నాగావరా, మాన్యతా టెక్ పార్క్ రోడ్‌లోని మాన్ఫో కన్వెన్షన్ సెంటర్ నందు సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగనుంది..

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక చిత్రం.. ‘సైరా నరసింహారెడ్డి’.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘సైరా’ రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ టీమ్ ఎటువంటి కట్స్ చెప్పకుండా యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.

సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను బెంగుళూరులో భారీగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 22న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం.. బెంగుళూరులోని నాగావరా, మాన్యతా టెక్ పార్క్ రోడ్‌లోని మాన్ఫో కన్వెన్షన్ సెంటర్ నందు సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.

Read Also : సైరా – బాంబే ప్రమోషన్స్‌లో చిరు సందడి..

గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ‘సైరా’  భారీగా విడుదల కానుంది. సంగీతం : అమిత్ త్రివేది, కెమెరా : రత్నవేలు, ఎడిటింగ్ : ఎ.శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవన్ నంబియార్, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : కమల్ కణ్ణన్.