పన్నూ మనసు పెద్దదే: విద్యార్థినికి ఐఫోన్ కొనిచ్చిన హీరోయిన్!

  • Published By: vamsi ,Published On : July 31, 2020 / 12:40 PM IST
పన్నూ మనసు పెద్దదే: విద్యార్థినికి ఐఫోన్ కొనిచ్చిన హీరోయిన్!

Updated On : July 31, 2020 / 1:00 PM IST

తెలుగు సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన తాప్సీ పన్నూ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలు తీస్తూ బిజీగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే లేటెస్ట్‌గా ఓ కర్ణాటక విద్యార్థినికి ఐఫోన్ కొనిచ్చి ఆమె తన ఉదారతను చాటుకున్నారు. ఓ మెరిట్ స్టూడెంట్ విద్యకు స్మార్ట్‌ఫోన్ అవసరం అయితే అందుకోసం ఆమె స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు.



ప్రీ-యూనివర్శిటీ కాలేజీ పరీక్షలలో 94 శాతం స్కోరు సాధించిన అమ్మాయి కథను ఎన్డీటివి ప్రసరాం చెయ్యగా.. చాలా మంది కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే స్మార్ట్‌ఫోన్‌ను అమ్మాయికి ఇచ్చారు తాప్సీ పన్నూ. బాలిక మరియు ఆమె ఇద్దరు సోదరీమణుల విద్యకు సాయం చెయ్యడానికి చాలామంది ముందుకొచ్చారు.

తాప్సీ పంపిన ఐఫోన్‌ను స్వీకరించిన అమ్మాయి నటికి కృతజ్ఞతలు తెలిపింది. విద్యార్థిని చాలా కష్టపడి నీట్(మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. “ఈ రోజు, నాకు తాప్సీ మామ్ నుంచి ఫోన్ వచ్చింది. నేను మొదట దీనిని నమ్మలేకపోయినట్లు” ఆమె చెప్పారు.



ఆమె తండ్రి తన బంధువుల నుండి డబ్బు తీసుకొని చదివించారు. అంతేకాదు తన ముగ్గురు కుమార్తెల చదువు కోసం తన భార్య బంగారు ఆభరణాలను అమ్మేశాడు. కొరోనావైరస్ మహమ్మారితో తరగతులన్నీ రద్దు కావడంతో ఈ రోజుల్లో కోచింగ్ మొత్తం ఆన్‌లైన్‌లోనే సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ తరగతులకు పనిచేసే స్మార్ట్‌ఫోన్‌ను తాప్సీ వారికి గిఫ్ట్‌గా ఇఛ్చింది.